Rice Pancakes: రైస్ పాన్​కేక్స్.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?

మామూలుగా మనకు బేకరీ లో డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ లభిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ల వరకు కేకులను ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది బ్రే

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 03:30 PM IST

మామూలుగా మనకు బేకరీ లో డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ లభిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ల వరకు కేకులను ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది బ్రేకరీ స్టైల్ లో కేక్స్ ని ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని ఎలా తయారు చేయాలి అందుకు ఏమేం పదార్థాలు కావాలి అన్న విషయాలు తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలా బేకరీ ఐటమ్స్ ని ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్ గా మిగిలిపోయిన అన్నంతో రైస్ పాన్ కేక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రైస్ పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు:

అన్నం – 1 కప్పు
మైదా పిండి – 1 కప్పు
చక్కెర – 1 టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 టీస్పూన్
బేకింగ్ సోడా – అర టీస్పూన్
ఉప్పు – పావు టీస్పూన్
పాలు – 1 కప్పు
గుడ్డు – 1
బటర్ – 2 టేబుల్ స్పూన్లు
వెనిలా ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్

రైస్ పాన్ కేక్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని దానిలో పాలు, గుడ్డు, బటర్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపీ, పెద్ద మిక్సింగ్​ గిన్నెలోకి పాలు, గుడ్లతో కూడిన మిశ్రమాన్ని మెల్లిగా వేస్తూ బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపితే పాన్​ కేక్ బాగా వస్తుంది. మొత్తం మిశ్రమాన్ని పిండి మిశ్రమంలో వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో రైస్ వేసి బాగా కలపాలి. రైస్​ను నేరుగా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసుకుని పిండిలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై నాన్​ స్టిక్ పాన్ పెట్టి,మీడియం మంట మీద ఉంచి పాన్​పై కాస్త వెన్నను అప్లై చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని దానిపై దిబ్బరొట్టిలాగా వేయాలి. దానిని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. లేదంటే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దానిని ఫ్రై చేయాలి. పాన్​ కేక్​ కాస్త ఉబ్బుతుంది. అంతే వేడి వేడి రైస్ పాన్​కేక్స్ రెడీ.