Skin Whitening: బియ్యం పిండిలో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు.. టాన్ మాయం అవ్వడం ఖాయం?

అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అందంగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూ

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 09:30 PM IST

అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అందంగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకొందరు కొన్ని హోమ్ రెమిడీలను ఫాలో అయ్యి అందాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీకు తెలుసా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కంటే ఇంట్లో దొరికే పదార్థాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన అందరిని రెట్టింపు చేయడంలో బియ్యప్పిండి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఎలాస్టిసిటీని పెంచుతాయి. ముడతలు మాయం చేస్తాయి. బియ్యం పిండి జిడ్డు చర్మాన్ని పరిష్కరిస్తుంది.

మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. బియ్యం పిండి ప్యాక్‌ టాన్‌ తొలగిస్తుంది, చర్మ ఛాయను మెరుగుపరచి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. బియ్యం పిండి ఫేస్‌ మాస్క్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను దూరం చేయాడనికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. డల్‌, డ్రై స్కిన్‌కు బెస్ట్‌ రెమిడీ. మీరు పిగ్మెంటేషన్‌ కారణంగా ఇబ్బందిపడుతుంటే.. ఒక టీ స్పూన్‌ బియ్యం పిండి, ఒక స్పూన్‌ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పిగ్మెంటేషన్‌ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

బియ్యం పిండిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నుంచి హానికరమైన టాక్సిన్స్‌, డార్క్‌ స్పాట్స్‌, మొటిమలు, మచ్చలను కలిగించే ఏడెంట్లను బయటకు పంపుతాయి. వేడి నీళ్లలో బ్లాక్‌ టీ బ్యాగ్‌ వేసి 2, 3 నిమిషాల పాటు ఉంచాలి. రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో ఒక స్పూన్‌ తేనె వేసి, టీ వాటర్‌ పోసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా తరచూ చేస్తే డార్క్‌ స్పాట్స్‌ మాయం అవుతాయి. బియ్యం పిండిలోని యాంటీ ఆక్సిడెంట్లు టాన్‌ తొలగించడానికి సహాయ పడతాయి. రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో ఒక టీస్పూన్‌ తేనె, 1 స్పూన్‌ రోజ్‌ వాటర్‌ వేసి పేస్ట్‌లా చేసి, ఆ మిశ్రమాన్ని టాన్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10 – 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మాములుగా శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. అలాంటప్పుడు చర్మం మృదువుగా మారడానికి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జు, ఒక స్పూన్‌ కీర దోస గుజ్జు వేసీ పేస్ట్‌లా చేయాలి. వీటిని బాగా మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. మంచి రిజల్ట్స్‌ కోసం వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ అప్లై చేసుకోవాలి. ప్రకాశవంతమైన చర్మం కోసం టమాటా పేస్ట్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ బియ్యం పిండి, 1 స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ వేసి మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి, దీన్ని 15 – 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.