మాములుగా పళ్ళు పసుపుపచ్చగా ఉంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురితో మాట్లాడాలి అన్న నలుగురిలోకి కలిసి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది దంతాలు గారపట్టి చూడటానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే పల్లపై ఉన్న గారను పసుపుదనాన్ని తొలగించుకోవడానికి రకరకాల టూత్ పేస్టులను మార్చడంతో పాటు రకరకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఈ గారను తొలగించడానికి చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తారు. అయితే ఇంటి వద్దే పళ్ళ పై ఉన్న మరకలను తొలగించవచ్చు.
ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ వంట సోడాను అర టీస్పూన్ ఉప్పుతో కలపాలి. తర్వాత టూత్ బ్రష్‌ను తడిగా చేసి ఉప్పు, వంట సోడా మిశ్రమంలో ముంచాలి. తర్వాత ఆ బ్రష్‌తో 5 నిమిషాలపాటు దంతాలపై రుద్దాలి. తరువాత వెంటనే ఒక కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని అరకప్పు వెచ్చని నీటిలో కలపి బాగా పుక్కిలించాలి. తర్వాత అరకప్పు చల్లటి నీటితో పుక్కిలించాలి. తర్వాత డెంటల్ పిక్ తీసుకొని దంతాలపై పసుపు మరకలు ఉన్న చోట జాగ్రత్తగా రుద్దండి. ఇలా చేశాక యాంటీ సెప్టిక్ మౌత్ వాష్‌తో నోరు కడుక్కోండి. రెండు రోజులకోసారి ఇలా చేయడం వల్ల పంటి గార తగ్గుతుంది.
అలాగే విటమన్ సి అధికంగా లభించే నిమ్మ, నారింజ, స్ట్రబెర్రీ లాంటి పండ్లను తీసుకొని 5 నిమిషాల పాటు దంతాలపై రుద్దడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆ పండ్లను రుద్దిన తర్వాత వంట సోడాతో పుక్కిలిస్తే సరి. కాస్త స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల నోట్లో లాలాజలం తగిన మోతాదులో ఉత్పత్తవుతుంది. తద్వారా నోరు సహజంగానే శుభ్రమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు నారింజ తొక్కతో పంటిపై రుద్దడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది.