ప్రస్తుత రోజుల్లో చాలామంది అందానికి సంబంధించిన చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిలో బ్లాక్ హెడ్స్ సమస్య కూడా ఒకటి. ఈ బ్లాక్ హెడ్స్ సమస్య ఎక్కువగా ముక్కు చంపలు వంటి ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. చర్మంపై ఉండే రంధ్రాల నుంచి నల్లగా పదార్థం బయటకు వస్తూ ఉంటుంది.. కొంతమందికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ ని తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్లాక్‌హెడ్స్ తొలగించడానికి ఈజీ పద్ధతిల్లో ఆవిరి పట్టడం కూడా ఒకటి. బ్లాక్ హెడ్స్ ఉన్నవారు కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టడం మంచిది. ఆ తర్వాత తడి వస్త్రంతో మృదువుగా తుడిస్తే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్ బయటకు వచ్చేస్తాయట. లేదంటే వీటిని తొలగించడానికి ప్రత్యేకమైన టూల్ ఉంటుందని, దాన్ని ఉపయోగించి కూడా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో తేనె కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ తేనె తీసుకుని అందులో కాస్త చక్కెర కలిపి ఫేస్ కి అప్లై చేసి చేతి వేళ్లతో మృదువుగా మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది అని చెబుతున్నారు. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటు బ్లాక్ హెడ్స్ ని తగ్గిస్తుందట.
బేకింగ్ సోడా కూడా బ్లాక్ హెడ్స్ ని తగ్గించడంలో ఎంతో ఎఫెక్ట్ గా పనిచేస్తుందట. అయితే ఇందుకోసం ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. తర్వాత ఫేస్ పై కొత్తకారంగా మృదువుగా వేళ్ళతో మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఫేస్ ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాలి. అయితే ఈ రెమిడిని కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. గ్రీన్ టీ ఉపయోగించే బ్లాక్ హెడ్స్ దూరం చేసుకోవచ్చట. ఇందుకోసం వాడేసిన గ్రీన్ టీ పొడిని ఫేస్ కు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నాడు. పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయని చెబుతున్నారు.