Site icon HashtagU Telugu

‎Gas: కడుపు నొప్పి గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే నిమిషాల్లోనే నొప్పి మాయం!

Gas

Gas

‎Gas: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు ఛాతిలో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలకు రక రకాల మెడిసెన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆయినా కూడా కొంతమందికీ ఆ ప్రాబ్లెమ్ తరచుగా వేదిస్తూనే ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఏమి చేయాలి? ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చట. జీర్ణవ్యవస్థ స్ట్రాంగ్​ ఉంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయని, మనం తీసుకునే ఆహారం, లైఫ్​స్టైల్ గట్ హెల్త్​ ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఇకపోతే ఉసిరి వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఉసిరి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల కడుపు శుభ్రమవుతుందట. ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, మంట నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుందని, ఇది జీర్ణశక్తిని బలపరిచి శరీరంలోని టాక్సిన్స్​ ను బయటకి పంపిస్తుందని చెబుతున్నారు.

‎కాగా అలోవెరాను చర్మం, జుట్టు కోసం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థకు కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అలోవెరా జెల్ కడుపు మంట, గ్యాస్​ ను తగ్గిస్తుందట. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున అరగ్లాసు అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయట. ప్రేగులను శుభ్రపరచి కడుపు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం ఇస్తుందని చెబుతున్నారు. త్రిఫల అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయ మిశ్రమం కడుపు సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుందట. ముఖ్యంగా నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో 1 చెంచా త్రిఫల పొడి కలుపుకొని తాగడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయట.

‎ ఇది ప్రేగులను కూడా బలపరుస్తుందట. జీర్ణవ్యవస్థను కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుందని, త్రిఫల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్​ ను తొలగించి కడుపును తేలికగా, సౌకర్యవంతంగా చేస్తుందని చెబుతున్నారు. అయితే పైన చెప్పిన వాటిని తరచుగా తీసుకోవడంతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలని చెబుతున్నారు. కేవలం చికిత్సల పైనే కాకుండా సమతుల్య జీవనశైలిపై కూడా దృష్టి పెట్టాలని, టైమ్ కీ ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, యోగాసనాలు వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. నూనె, మసాలా, ఇతర జంక్ ఫుడ్​ లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Exit mobile version