Site icon HashtagU Telugu

Backpain remedies: బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారా? రిలీఫ్ కోసం ఈ టిప్స్ పాటించండి!

Backpain Remedies

Backpain Remedies

Backpain remedies: మనలో చాలా మంది నడుం నొప్పితో బాధపడుతూ ఉంటారు. కరోనా తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోం కారణంగా వెన్నునొప్పి వస్తోందని డాక్టర్లను సంప్రదిస్తున్నారని తేలింది. 90 శాతం మంది ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతున్నారట. అయితే, నడుం నొప్పితో బాధపడే వారిలో ఎక్కువ మంది పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకొని సరిపెట్టుకుంటున్నారట. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి దానంతట అదే తగ్గిపోతుందని తేలింది.
సాధారణ నడుం నొప్పి సమస్య ఉంటే పర్వాలేదని, కానీ వెన్ను పాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోవడం లాంటి భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాల్లో రాళ్లు పడటం వంటి సమస్యలకు నడుం నొప్పి కారణం అవుతుందని సూచిస్తున్నారు.
చాలా మందిలో వెన్నుపాములో ఇబ్బందుల వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. అయితే, డిస్క్ సమస్యల వల్ల వచ్చే నడుం నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. చాలా సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నా వెన్నుపాముతో ఎలాంటి సంబంధం ఉండదు. నొప్పి ఎలాంటిదైనా నడుము విషయంలో అశ్రద్ధ పనికి రాదని నిపుణులు సూచిస్తున్నారు.
యోగా, వ్యాయామం చేయాలి..
నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిందో తెలుసుకోవాలి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా బ్యాక్ పెయిన్ ను దూరం చేసుకోవచ్చు. తరచూ నడుం నొప్పితో బాధపడే వారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లిమిటెడ్ గా ఫుడ్ తీసుకోవడాన్ని ప్రిఫర్ చేయాలి. రోజులో కాస్త సమయాన్ని యోగా, వ్యాయామం, స్పోర్ట్స్, డ్యాన్స్ లాంటి వాటిని కేటాయించాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం కూర్చొని ఉండరాదు. నిలబడినప్పుడు సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. బరువులు ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి.