దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

సమస్య తేల్చకుండా పడుకోవడం వల్ల భాగస్వామిపై మనస్సులో రకరకాల సందేహాలు మొదలవుతాయి. "అతనికి/ఆమెకు నాపై పట్టింపు లేదు.

Published By: HashtagU Telugu Desk
Relationship Tips

Relationship Tips

Relationship Tips: దంపతులు లేదా ప్రేమికులు తరచుగా రాత్రివేళల్లో గొడవ పడిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోకుండానే పడుకుంటూ ఉంటారు. చాలాసార్లు గొడవ పడి పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం భాగస్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఆపై ఒకటి రెండు రోజుల తర్వాత గొడవ గురించి చర్చించకుండానే మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అయితే గొడవను పరిష్కరించుకోకుండా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో? ఆ గొడవను అణిచివేయడం వల్ల బంధంపై ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా? గొడవ లేదా వాదన తర్వాత సమస్యను తేల్చకుండా ఎందుకు పడుకోకూడదో తెలుసుకుందాం!

గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

కోపం పెరగవచ్చు

మీరు గొడవను పరిష్కరించుకోకుండా పడుకున్నప్పుడు నిద్రపోయే ముందు మీ ఉపచేతన మనస్సులో ఆ గొడవ గురించి, ఆ బాధ గురించి, భాగస్వామి అన్న ప్రతికూల మాటల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అదే గొడవను పరిష్కరించుకుని పడుకుంటే మీ కోపం తగ్గుతుంది. బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తారు.

Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఇన్ఫోసిస్ కొత్త రూల్స్

బాధ పెరుగుతుంది

వాదన లేదా గొడవ సమయంలో కలిగే బాధ కంటే దాన్ని పరిష్కరించుకోకుండా పడుకున్నప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. మనస్సులో కోపం, ఆందోళన పెరుగుతాయి. దీనివల్ల వ్యక్తి గంటల తరబడి నిద్రలేక పక్కపై అటు ఇటు దొర్లుతూ ఆవేదన చెందుతుంటాడు.

బంధం బలహీనపడుతుంది

సమస్య తేల్చకుండా పడుకోవడం వల్ల భాగస్వామిపై మనస్సులో రకరకాల సందేహాలు మొదలవుతాయి. “అతనికి/ఆమెకు నాపై పట్టింపు లేదు. అందుకే నన్ను బుజ్జగించకుండానే పడుకున్నారు” అని మీకు అనిపించవచ్చు. మీ భాగస్వామి మనస్సులో కూడా ఇలాంటి ఆలోచనలే ఉండవచ్చు. గొడవ పడి పడుకునే బదులు దాన్ని అప్పుడే పరిష్కరించుకుంటే.. “నా మనసులోని మాట చెప్పేశాను” అనే తృప్తితో మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రంతా మీరు నిర్లక్ష్యానికి గురైనట్లు భావించరు.

గొడవ తర్వాత నిద్రపోవడం వల్ల ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది?

  • ఒకవేళ గొడవ తర్వాత మీరు మీ దృక్పథాన్ని మార్చుకుని ఆలోచించడానికి ప్రయత్నిస్తే, వెంటనే నిద్రపోవడం వల్ల మీ కోపం శాంతించవచ్చు.
  • గొడవ, భావోద్వేగ తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మీరు మాట్లాడుకున్నప్పుడు మరింత ప్రశాంతంగా, మెరుగైన రీతిలో చర్చించే అవకాశం ఉంటుంది.
  • కొన్నిసార్లు గొడవ జరిగిన వెంటనే మాట్లాడితే కోపంలో మనం తర్వాత పశ్చాత్తాపపడే మాటలు అనేస్తుంటాం. అలాంటప్పుడు మరుసటి రోజు ఉదయం ఆలోచించి మాట్లాడటం మంచిది.

గొడవను వెంటనే ఎలా పరిష్కరించుకోవాలి?

భాగస్వామితో గొడవ పడిన తర్వాత మీ కోపాన్ని పక్కన పెట్టి వారిని ప్రేమతో హత్తుకుంటే అవతలి వారి కోపం కూడా కరిగిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు భాగస్వామిని హత్తుకోవడం వంటి చిన్న పని కూడా చాలా కష్టంగా అనిపించవచ్చు. ఒకవేళ తప్పు మీదే అయితే భాగస్వామి మిమ్మల్ని హత్తుకుంటారో లేదో చెప్పలేమ. కానీ మీరు చొరవ తీసుకోవడం బంధానికి మేలు చేస్తుంది.

  Last Updated: 27 Jan 2026, 08:25 PM IST