గొడవలు లేని కుటుంబంలో మనస్పర్థలు, విమర్శలు ఇద్దరి మధ్య ప్రేమను పెంచి బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. అయితే ఒక్కోసారి వ్యక్తి చేసే చిన్న చిన్న పొరపాట్లు, అడ్డంకులు బంధాన్ని దూరం చేస్తాయి. ఎంతగా అంటే ఈసారి దాని గురించి ఆలోచించరు. కొందరికి కొన్ని సార్లు భాగస్వామి ప్రవర్తనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక్కసారి ఈ ఫీలింగ్ మనసులోకి వస్తే చాలు రిలేషన్ షిప్ లో మనస్పర్థలు మొదలవుతాయి. అయితే ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు విడాకుల దశకు చేరుకుంటున్నాయి. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ..!
We’re now on WhatsApp. Click to Join.
భావాలు లేదా మాటలతో మీ భాగస్వామిని ఆటపట్టించడం మంచిది కాదు. మీరు మీ భార్య లేదా భర్తతో ఇలా చేయబోతుంటే అది ఆపండి. ఇది మీతో జీవిస్తున్న వ్యక్తికి హింసగా అనిపించవచ్చు , దీని కారణంగా వివాహాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది.
పాత ప్రేమికుడి గురించి లేదా సంబంధంలో పాత సంబంధం గురించి ఎప్పుడూ మాట్లాడకండి. అది మీ గతం.. కాబట్టి పాత సంబంధాలను తవ్వుకోవడం మంచిది కాదు. దీంతో భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చెడిపోతాయి.
మీ భాగస్వామి అనవసరమైన విషయాల గురించి పదేపదే మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. ఈ విషయం తెలిసి కూడా ఒంటరిగా ఉన్నపుడు ఆ విషయాలు ప్రస్తావన తీసుకురావడం ఖచ్చితంగా మంచిది కాదు. ఇది ఇద్దరి మానసిక స్థితిని పాడు చేస్తుంది.
జీవిత భాగస్వామిని అనుమానించడం కూడా బంధం విచ్ఛిన్నానికి ప్రధాన కారణం. భార్యను భర్త ప్రేమిస్తాడనీ, భర్తను భార్య ప్రేమిస్తుందని తెలిసి కూడా వారిని అనుమానించడం సరికాదు. జీవిత భాగస్వామి మొబైల్‌ని తనిఖీ చేయడం, వారి కదలికలపై ప్రశ్నించడం. ఇది ఇద్దరి మానసిక స్థితిని పాడు చేస్తుంది.
మీ భాగస్వామిపై కోపం రావడం సహజం. కానీ కోపంతో అరవకండి. ఈ విషయంలో మాత్రం రిలేషన్‌షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో కోపంగా ఉన్నప్పుడు, వీలైనంత ప్రశాంతంగా వ్యవహరించండి, లేకపోతే మౌనంగా ఉండండి.
Read Also : Mega DSC : మెగా డీఎస్సీ కోసం విద్యాశాఖ కసరత్తు