Relationship : ఆన్ లైడ్ డేటింగ్ చేస్తున్నారా..అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో కోలుకోలేరు..!!

కాలం పూర్తిగా మారిపోయింది, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌గా మారుతోంది. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. ఈ రోజుల్లో ఆన్‌లైన్ డేటింగ్ కూడా ట్రెండ్‌ గా మారింది.

  • Written By:
  • Updated On - August 9, 2022 / 10:08 AM IST

కాలం పూర్తిగా మారిపోయింది, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌గా మారుతోంది. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. ఈ రోజుల్లో ఆన్‌లైన్ డేటింగ్ కూడా ట్రెండ్‌ గా మారింది. పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు ప్రజలు ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారు. యువతీ, యువకులు మొదట సోషల్ సైట్ల ద్వారా కలుసుకుంటారు. తర్వాత ఒకరితో ఒకరు ఆన్‌లైన్‌లో డేటింగ్ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ డేటింగ్‌లో మనం చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయని మీకు తెలుసా. వాటి గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ షేర్ చేయకూడదు
మీరు ఆన్‌లైన్‌లో ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నప్పుడు, మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలా చేయడం వల్ల మీకు తర్వాత సమస్యలు రావచ్చు. ఎదురుగా ఉన్న వ్యక్తి మీ సమాచారాన్ని దుర్వినియోగ పరిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి, వాటిని పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫోటోలను షేర్ చేసుకోవడం మానుకోండి
అమ్మాయిలు, అబ్బాయిలు ఆన్‌లైన్‌లో డేటింగ్ చేస్తున్నప్పుడు, దేని గురించి ఎక్కువగా ఆలోచించరు. మరో లోకంలో మైమరిచిపోయి ఆలోచించకుండా తమ ఫోటోలను ఎదుటి వారితో పంచుకుంటారు. అయితే ఈ రోజుల్లో ఫోటోలను మార్ఫింగ్ పేరుతో ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిందే. అటువంటి పరిస్థితిలో, తెలియని వ్యక్తిని విశ్వసించి మీ ఫోటోలను పంచుకోవడం ప్రమాదంతో కూడుకున్నది. అది కూడా ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మరింత ప్రమాదకరం.

తొందరగా నమొద్దు..
ఆన్‌లైన్‌లో డేటింగ్ చేసేవారు ఎదుటి వ్యక్తిని నమ్మించడం కోసం తేనే పూసిన మాటలతో ఏమారుస్తారు. అయితే ఎదుటి వ్యక్తి నిన్ను ఎంత ప్రేమిస్తాడనేది అనవసరం. ఎందుంటే వారి మాటలకు పడిపోయి, మీరు చెప్పిన పని చేస్తే తర్వాత చాలా బాధపడతారు. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని విషయాలను ముందుగానే క్లియర్ చేసుకోవాలి, తద్వారా మీరు తర్వాత చింతించాల్సిన అవసరం లేదు.

వీడియోలతో జాగ్రత్తగా ఉండండి
చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో డేటింగ్ చేస్తున్నప్పుడు వారి వీడియోలను రికార్డు చేసి పంపుతారు. వాటిని ఎదుటి వ్యక్తితో పంచుకుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకు సరైనదో మీరే ఆలోచించండి. ఇది మాత్రమే కాదు, ఇలాంటి వీడియోలతో మీ రిస్క్ మరింత పెరుగుతుంది, ఎందుకంటే ఎదుటి వ్యక్తి వాటిని తప్పుడు పద్ధతుల్లో ఉపయోగిస్తే, అది మీకు చాలా నష్టం కావచ్చు. కాబట్టి వీడియో విషయంలో జాగ్రత్తగా ఉండండి.