Site icon HashtagU Telugu

Relationship : ఒక వ్యక్తి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిపే 9 సంకేతాలు..!

Relationship

9 Clear Signs That A Guy Has Fallen Madly In Love With You

ఒక వ్యక్తితో ఉన్న రిలేషన్ (Relationship) లో అతను చూపించే ప్రేమ అభిమానాన్ని బట్టి అతను మన మీద ఎంత ఇష్టంతో ఉన్నాడన్నది తెలుస్తుంది. హృదయానికి దగ్గరైన మనుషులు దొరకడం చాలా కష్టం. అలాంటి వారిని గుర్తించడం కూడా కష్టమే. ఒక వ్యక్తి గురించి ఏమి తెలియకుండా ప్రేమ అభిమానం పెంచుకోవడం అనేది ప్రమాదం. ఈ 9 సంకేతాలు ఎవరైతే వ్యక్తి మన మీద చూపిస్తారో అలాంటి వారు మనల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా సంకేతాలు అంటే..

1. మీ సంతోషమే ప్రధానంగా..

మీతో రిలేషన్ (Relationship) లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చూస్తారు. అంతేకాదు అవసరాలను సమకూరుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడు మీరు కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చూసుకుంటారు. మీ సంతోషంలోనే వారి సంతోషం అన్నట్టుగా ఉంటారు (9 Clear Sings Madly Love).

We’re now on WhatsApp. Click to Join.

2. మీ కోసమే ఎక్కువ సమయం..

మీతో రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి మీ కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. మీరు చేసే అన్ని పనుల్లో మీకు తోడుగా ఉంటారు. మీతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు వారి షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా వారికి తగిన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మీ కోసం వారి సమయాన్ని వెచ్చిస్తూ మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు.

3. మీ కలలను నిజమయ్యేందుకు సపోర్ట్ గా..

భాగస్వామి లేదా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ కలలను మీకున్న డ్రీమ్స్ ని వారు గౌరవిస్తారు. అంతేకాదు మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. మీరు ఎంచుకున్న మార్గం లో మీకంటూ కొంత స్పేస్ ఇస్తూ మీ లక్ష్యాలను గౌరవిస్తూ వాటిని అందుకునేలా చేస్తారు.

4. మీ జీవితం మీద ఆతృత..

ఈ నిమిషం సంతోషంగా ఉండటమే కాకుండా మీ జీవితం మొత్తం ఆనందంగా ఉండేలా చేసేలా వారి ఆలోచన ఉంటుంది. దాని కోసం కావాల్సిన అన్ని విషయాలను సమర్ధవంతంగా ఏర్పాటు చేసుకుంటారు. ప్రేమని అందిస్తూనే ఫ్యూచర్ హ్యాపీగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

5. మీ దగ్గర ఏ విషయాన్ని దాచాలని చూడరు..

భాగస్వామి విషయంలో అందరిలో ఉండే డౌట్ ఇది. అతను తమ దగ్గర ఏదైనా దాస్తున్నాడా అన్న ఆలోచన ఉంటుంది. కానీ అలాంటిది ఏమి లేకుండా అన్ని విషయాలను మీతో పంచుకుంటారు. ఇతరుల దగ్గర చెప్పని విషయాలను కూడా మీతో పంచుకుంటారు.

Also Read : Mature Women Don’t Do In A Relationship : రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు పరిణతి చెందిన మహిళలు.. ఈ 15 పనులు అసలు చేయరు..!

6. ఫ్యామిలీకి మిమ్మల్ని దగ్గర చేయడం..

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమ ఫ్యామిలీకి మిమ్మల్ని దగ్గర చేయడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేయడం వల్ల అతని నిజాయితీని గుర్తించవచ్చు. కుటుంబం, స్నేహితులకు మీ గురించి మీరు తన లైఫ్ లో ఎవరన్న విషయం గురించి చెబుతున్నారు అంటే వారి ఆమోదం పొందుతున్నట్టే లెక్క.

7. ఫ్యూచర్ ప్లానింగ్..

భాగస్వామి ఎప్పుడు మీ ఫ్యూచర్ గురించి రిలేషన్ షిప్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తుంటారు. ఫ్యూచర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలని ప్లాన్ చేస్తారు. అన్ని విధాలుగా భవిష్యత్తు బాగుండేలా చూస్తారు.

8. కాంప్రమైజ్ అవుతారు..

రిలేషన్ షిప్ లో ఉన్న వారు ప్రతి విషయానికి రాజీ పడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ శాతం మిమ్మల్ని అధికంగా ప్రేమించే వ్యక్తి మీరు చెప్పిన ప్రతి విషయానికి ఆర్గ్యుమెంట్ చెయ్యరు. రాజీకి వచ్చి ఆలోచిస్తారు. అన్నివేళలా ఇలా జరుగుతుందని కాదు కానీ ఎక్కువ శాతం మీ ఒపీనియన్ కు గౌరవం ఇస్తారు.

9. నవ్వుతాడు నవ్విస్తాడు..

మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని నవ్విస్తూ అతను నవ్వుతాడు. రిలేషన్ షిప్ లో ఎప్పుడు బాధ్యతలు, బాధలే కాకుండా సరదాగా నవ్వుకునే అవకాశం ఉండాలి. ఈ విషయంలో భాగస్వామి మిగతా వారితో కన్నా మీతో ఎక్కువగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు.

Also Read:  India Mango Exports: మామిడి పండు.. ప్రపంచ దేశాల్లో భలే గిరాకీ..!