Relationship : అతన్ని వదిలి వెళ్లమని చెప్పే 8 సంకేతాలు ఇవే..!

Relationship రిలేషన్ షిప్ స్టేటస్ లో కలిసి ఉండాలన్న ఆలోచన ఒక్కరికి కాదు ఇద్దరికి ఉంటేనే బాగుంటుంది. భాగస్వామితో కలిసి ఉండే క్రమంలో కొన్ని పరిణామాలు

Published By: HashtagU Telugu Desk
Relationship 8 Signs He’s Telling You To Leave Him Alone And Move On

Relationship 8 Signs He’s Telling You To Leave Him Alone And Move On

Relationship రిలేషన్ షిప్ స్టేటస్ లో కలిసి ఉండాలన్న ఆలోచన ఒక్కరికి కాదు ఇద్దరికి ఉంటేనే బాగుంటుంది. భాగస్వామితో కలిసి ఉండే క్రమంలో కొన్ని పరిణామాలు తమని వదిలి దూరం వెళ్లమని పార్ట్ నర్ సూచించే 8 సంకేతాలు ఇవే.

ముందుగా అతని భావాలని తెలియచేలకపోవడం. భావాలను గురించి ఖచ్చితంగా తెలియనప్పుడు, అది అతని చర్యలలో చూపిస్తుంది. సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అతను కొంచెం దూరంగా ఉన్నట్లు లేదా గందరగోళంగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. అలాంటి సందర్భాలలో, అతను నిజంగా ఏమి కోరుకుంటున్నాడో గుర్తించడానికి ప్రయత్నించాలి.

We’re now on WhatsApp : Click to Join

మీ మీద ఆసక్తి తగ్గింది అని చెప్పే ముఖ్యమైన రీజన్. మీ కాల్స్ అండ్ టెక్స్ట్ లను ఇగ్నోర్ చేయడం. భాగస్వామి పట్ల బాధ్యతగా లేని వారు మీకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు.

మీ కన్నా స్నేహితులతో ఎక్కువ టైం గడపడం. ఉన్న టైం లో మీతో కాసేపైనా సరదాగా ఉండకుండా ఉన్న కాస్త టైం ని కూడా ఫ్రెండ్స్ తో గడపడం లాంటివి చేస్తుంటాడు. అలా చేస్తే మీ మధ్య సఖ్యత లోపిస్తుంది.

ఉంటే స్నేహితులతో ఉండటం లేదా తన పని మీద అతను ఎప్పుడూ బిజీగా ఉండటం చేస్తుంటాడు. అలాంటప్పుడు అతనితో ఏకాంతంగా మాట్లాడాలనుకునే మీ ఆలోచనలు మీతోనే ఉండాల్సి ఉంటుంది. వారు మీకు తగిన సమయం ఇవ్వకపోవడం అతను మీకు దూరం అవుతున్నాడనే అర్ధం.

మీ మధ్య ఎలాంటి సీరియస్ సంభాషణలు లేకపోతే అది కూడా మీ బంధాన్ని తేలికగా చేస్తుంది. ఎప్పుడైతే జీవితం పట్ల సీరియస్ సంభాషణలు జరుపుతారో వారికి రిలేషన్ షిప్ మీద నమ్మకం గౌరవం ఉన్నట్టు అవుతుంది.

అంతేకాదు ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి బదులుగా దాన్ని ఇంకా పెంచాలనే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి అతన్ని వదిలి మీరు వెళ్లాలనే సంకేతాలు ఇస్తాయి.

మీతో ఎమోషనల్ గా డిస్టన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. మీతో ఎప్పుడు ఎమోషనల్ కనెక్షన్ ఉండరు. మీ పట్ల ఎప్పుడు ఆసక్తి చూపించరు. మీతో ఉండాలనుకునే వారు ఎప్పుడు మీ పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు. మీ మీద అనాసక్తి ఉన్నారు అంటే అతన్ని మీరు దూరంగా వెళ్లండని గుర్తు చేస్తున్నట్టే లెక్క.

Also Read : Relationship : ఈ రాశులవారు తమ పార్ట్నర్ ను ఎప్పటికీ వదిలిపెట్టరట..

  Last Updated: 05 Nov 2023, 04:07 PM IST