Relationship : ఆమె మీ నుంచి దూరమవ్వాలనుకుంటుందని సూచించే 8 సంకేతాలు..!

రిలేషన్ షిప్ (Relationship) లో ఎవరు ఎలా ఉన్నా ఇద్దరు కలిసి ఉండాలనే కోరుతారు. కానీ భాగస్వామి నుంచి దూరం అవ్వాలనుకునే వ్యక్తుల

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 09:04 AM IST

రిలేషన్ షిప్ (Relationship) లో ఎవరు ఎలా ఉన్నా ఇద్దరు కలిసి ఉండాలనే కోరుతారు. కానీ భాగస్వామి నుంచి దూరం అవ్వాలనుకునే వ్యక్తుల సంకేతాలు కొన్ని ఉంటాయి. అయితే అది ఆమె నుంచి అతను అయినా అతని నుంచి ఆమె అయినా ఇవి వేరుగా ఉంటాయి. అతని నుంచి ఆమె దూరం అవ్వడానికి రెడీగా ఉందని చెప్పే 8 సంకేతాలు ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp : Click to Join

1.మీ కన్నా స్నేహితులే ముఖ్యం

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు ప్రేమ అనురాగాలతో ఉండాలి. అయితే అతని మీద ఆమెకు ప్రేమ లేనట్టైతే ఆమె అతని కంటే తన స్నేహితులతో ఎక్కువగా ఉండాలని చూస్తుంది. ఆమె అతని చుట్టూ ఉండకుండా ఉండటానికి ఇలా చేస్తుంది. ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతుంది. అతనితో కలిసిపోవడానికి ఇష్టపడదు దగ్గరయ్యే ఆలోచన కూడా ఆమెకు లేదని అర్ధం చేసుకోవాలి.

2. ఎలాంటి ఫిర్యాదులు ఉండవు

రిలేషన్ షిప్ కొనసాగించాలనుకునే వారు అది అలా ఇది ఇలా అంటూ ఫిర్యాదులు సర్ధుబాట్లు చేస్తుంటారు. కానీ అలాంటిది ఏమి లేదంటే ఆమె మీకు దూరమవ్వాలని రెడీగా ఉందని గుర్తించాలి. ఆమె మీతో సంబంధాన్ని వదులుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇకపై ఏ విషయాల గురించి ఆమె పట్టించుకోదు.

3. మాట్లాడటానికి ఆసక్తి లేకపోవడం

భాగస్వామితో సంభాషణ అనేది రిలేషన్ షిప్ లో చాలా అవసరం. కానీ అలా మీతో మాట్లాడకుండా ఆమె ప్రవర్తిస్తుంది అంటే ఆమె మిమ్మల్ని విడివి వెళ్లేందుకు రెడీ అన్నట్టే లెక్క. ఇద్దరి మధ్య మాటలు లేకపోతే దాదాపు ఆ రిలేషన్ షిప్ బ్రేక్ చేసే టైం వచ్చినట్టు గుర్తించాలి.

4. ఆమె మీతో ప్రణాళికలు వేయడం మానేస్తుంది

మీ నుంచి దూరమవ్వాలని కోరుకునే వ్యక్తి మీతో ఫ్యూచర్ కి సంబంధించిన ప్రణాళికలు వేయడం ఆపివేస్తుంది. కలిసి పనులు చేయాలని అనుకోరు. ఆమె మీ చుట్టూ ఉండటం ఇష్టం లేదని అర్థం. ఆమె ప్లాన్‌లను సూచించేది అయితే ఇప్పుడు మీతో తక్కువ సమయం గడుపుతుంటే, ఆమె బహుశా మీ నుంచి దూరమయ్యేందుకు సిద్ధమవుతుందని అర్ధం.

Also Read  : Relationship : మీతో ప్రేమలో ఉండే వ్యక్తి చేసే 9 విషయాలివే..!

5. నవ్వడం కాదు చిరాకుతో ఉండటం

భాగస్వామితో పాజిటివ్ యాంగిల్ లో ఆలోచించడం మానేసి నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే అతను చేసే ప్రతి పని తప్పే అవుతుంది. అలానే మీ నుంచి విడిపోవాలని అనుకునే ఆమె కూడా అతను ఏం చేసినా సరే చిరాకు అనిపిస్తుంది. నవ్వడం పూర్తిగా మర్చిపోతారు.

6. సంభాషణలో ఇతరుల గురించి

రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యలో వేరే వ్యక్తుల గురించి ప్రస్థావన వస్తే ఆ రిలేషన్ షిప్ ముందుకు సాగదు. ముఖ్యంగా ఆమె మీతో మాట్లాడేప్పుడు వేరే వ్యక్తి గురించి చెప్పడం మొదలు పెడితే ఆమె మీ నుంచి దూరం అవ్వడానికి రెడీ అన్నట్టు సంకేతమే అని గుర్తించాలి.

7. కాల్స్ కాదు మెసేజ్ కూడా

మీతో దూరం అవ్వాలని అనుకునే వ్యక్తి మీ కాల్స్ మాత్రమే కాదు మీకు కనీసం టెక్స్ట్ మెసేజ్ కూడా చేయడానికి ఇష్టపడరు. వారు మీతో కలిసి ఉండాలనే ప్రయత్నం కన్నా విడిపోవాలనే ఆలోచనతోనే ఎక్కువ ఉంటారు.

8. దూరం పెట్టడం, ఎఫెక్షన్ చూపించకపోవడం

ఆమె మిమ్మల్ని దూరం పెట్టడం మీతో ఆప్యాయంగా ఉండకపోవడం ఆమె మీతో భాగస్వామ్యాన్ని కోరట్లేదని అర్ధం. ఆమె మీ నుంచి దూరం అయ్యేందుకు సిద్ధంగా ఉందని గుర్తించాలి.