Relationship : అతను మిమ్మల్ని ప్రేమించట్లేదని చెప్పే 12 సంకేతాలు..!

Relationship ఒకప్పుడు ప్రేమ పక్షులుగా ఉండే కొందరు ఇద్దరి మధ్య ఆ ఆకర్షణ తగ్గిన తర్వాత ఒకరిని

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 12:10 AM IST

Relationship ఒకప్పుడు ప్రేమ పక్షులుగా ఉండే కొందరు ఇద్దరి మధ్య ఆ ఆకర్షణ తగ్గిన తర్వాత ఒకరిని ఒకరు ఎలా వదిలించుకోవాలా అన్నట్టు చూస్తుంటారు. ముఖ్యంగా భాగస్వామి విషయంలో అతను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పే 12 సంకేతాలు అతను మీకు దూరం అవుతున్నాడని గమినించాలి.

We’re now on WhatsApp : Click to Join

ఇంతకీ ఏంటా 12 విషయాలు అంటే..

1. సంభాషణ జరపడానికి ఆసక్తి చూపరు

మీతో ఎప్పుడూ మాట్లాడే అతను ఇప్పుడు కనీసం మీతో కలిసి సంభాషించడానికి కూడా ఆసక్తి చూపించరు. మీతో మాట్లాడటానికి అయిష్టంగా ఉన్నారు అంటే అతనికి మీ మీద ప్రేమ తగ్గినట్టే అని గుర్తించాలి.

2. సన్నిహితంగా ఉండడు

భాగస్వామిలో ప్రేమ తగ్గినప్పుడు ఇంటిమసీ కూడా తగ్గుతుంది. మీతో సన్నిహితంగా ఉండేందుకు కూడా అతను ఆసక్తి చూపించడు. ఈ తేడా కచ్చితంగా అతనికి మీ మీద ఉన్న ప్రేమ తగ్గిందని చెప్పడానికి మొదటిగా గుర్తించబడుతుంది.

3. మీకు దూరంగా ఎక్కువ టైం కేటాయించడం

కొత్తలో మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేసేందుకు ఆసక్తి చూపించిన అతను మీకు దూరంగా ఉండేందుకు చూస్తాడు. ఎక్కువ టైం బయట గడుపుతాడు. అలా మీకు ఎక్కువ టైం ఇవ్వకుండా చూస్తాడు.

4. ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవడం

భాగస్వామి ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అతను సరైన మార్గం లో ఉన్నాడని అర్ధం. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఉన్నాడు అంటే అతనికి మీ మీద ప్రేమ తగ్గినట్టే అని చెప్పొచ్చు.

5. ప్రతిదానికి గొడవ పడటం

ప్రేమ తగ్గిన చోట గొడవలు కామన్. అలా ప్రతి దానికి మీతో గొడవ పడుతున్నాడు అంటే అతను మీకు దూరం అవుతున్నాడని గుర్తించాలి. అంతకుముందు విషయాలను గుర్తు చేసుకుని మరీ గొడవ చేస్తే అతనికి మీ పట్ల ప్రేమ అసలు లేదని అనుకోవాలి.

6. చిన్నగా దూరం అవుతుండటం

మీతో గడిపే క్షణాలను ఆస్వాధించలేకపోవడం. మీరు లేకుండా ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపించడం లాంటివి చేస్తుంటారు. చిన్నగా మీకు దూరం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

7. నెగిటివ్ గా ఆలోచించడం

ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో ఉండటం వల్ల మీరు చూపించే ప్రేమ అతనికి కనిపించదు అందుకే మీ మీద ప్రేమ తగ్గిపోతుంది.

8. ఎగ్ షెల్స్ మీద నడుస్తున్నట్టుగా

భాగస్వామి తమపై చూపించే అశ్రద్ధకి మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి ఎగ్ షెల్స్ మీద నడిచినట్టుగా అనిపిస్తుంది.

Also Read : 7 Things Men Do When They Cheat In a Relationship : భాగస్వామి మోసం చేస్తున్నాడని తెలిపే 7 విషయాలు..!

9. అతనికి మీరు ప్రాధాన్యత కారు

ప్రేమ తగ్గిన చోట ప్రాధాన్యత తగ్గుతుంది. సో మీ మీద ఎఫెక్షన్ ప్రేమ తగ్గాయి అనిపిస్తే అతనికి మీరు ప్రాధాన్యత కారన్నట్టే లెక్క.

10. ప్రేమించడం ప్రశంసించడం మర్చిపోతారు

అంతకుముందు ప్రేమించడం ఏదైనా విషయంలో ప్రశంసించడం చేసే అతను మిమ్మల్ని పూర్తిగా పట్టించుకోకపోవడం అతనికి మీ ప్రేమ అవసరం లేదని అర్ధమవుతుంది.

11. సాకులు చెప్పి తప్పించుకోవడం

మీరు అతనితో గడపాలని అనుకున్నా సరే అతను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. అలాంటి టైం లో కూడా మీరు అతని ప్రేమకు దూరమవుతున్నారని గుర్తించాలి.

12. మీకు అసలు టైం ఇవ్వకపోవడం

మీకు కావాల్సిన టైం ఇవ్వకపోవడం కూడా తరచు జరుగుతుంది. భాగస్వామి తో కూడా టైం స్పెండ్ చేలేనంత బిజీగా ఉన్నారంటే మీ మీద అతని ప్రేమ తగ్గినట్టే అని గుర్తించాలి.