Site icon HashtagU Telugu

Refrigerator Buying Tips: మీరు ఫ్రిజ్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే..!

Refrigerator Buying Tips

Safeimagekit Resized Img (7) 11zon

Refrigerator Buying Tips: ఫ్రిజ్ కొనడానికి వెళుతున్నప్పుడు ఫ్రిజ్ సామర్థ్యాన్ని (Refrigerator Buying Tips) ఎంచుకోవడంలో అతిపెద్ద సమస్య వస్తుంది. ఒక్కోసారి అవసరమైన దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫ్రిజ్‌ని.. కొన్నిసార్లు తక్కువ కెపాసిటీ ఉన్న ఫ్రిజ్‌ని ఇంటికి తెచ్చుకుంటాం. ఇది మాత్రమే కాదు చాలా సార్లు మనం పెద్ద ఫ్రిజ్ తీసుకువస్తాము. కానీ దానిని ఉంచడానికి ఇంట్లో తగినంత స్థలం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని పొందాల‌ని చెబుతుంటారు.

ముందుగా రిఫ్రిజిరేటర్ రకాలను తెలుసుకోండి

మార్కెట్‌లో అనేక రకాల రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి సింగిల్ డోర్, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్, సైడ్ డోర్. సింగిల్, డబుల్ డోర్ ఫ్రిజ్‌ల కంటే సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌లు పెద్దవిగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రిఫ్రిజిరేటర్ కొనండి.

Also Read: Apple iPhones Ban: ఈ దేశంలో ఐఫోన్ల‌పై నిషేధం.. రీజ‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎంతమందికి ఎంత పెద్ద ఫ్రిజ్?

ఒక వ్యక్తి ఒంటరిగా నివసిస్తుంటే అతనికి 40 నుండి 100 లీటర్ల సామర్థ్యం ఉన్న వ‌న్ డోర్ రిఫ్రిజిరేటర్ సరిపోతుంది. కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే ఈ కింద ఇచ్చిన సామర్థ్యం రిఫ్రిజిరేటర్ సరిపోతుంది:

2 సభ్యులు, 1 బిడ్డ: 150 నుండి 250 లీటర్లు
2 సభ్యులు, 2 పిల్లలు: 250 నుండి 350 లీటర్లు
3 సభ్యులు, 2 పిల్లలు: 250 నుండి 500 లీటర్లు
4 సభ్యులు, 2 పిల్లలు: 550 నుండి 850 లీటర్లు

BEE ప‌వ‌ర్ రేటింగ్‌పై కూడా శ్రద్ధ వహించండి

ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల మాదిరిగానే ఫ్రిజ్‌కు కూడా ప‌వ‌ర్ పొదుపు రేటింగ్ ఉంది. ఇది 1 స్టార్ నుండి 5 స్టార్ వరకు ఉంటుంది. 5 స్టార్ ఫ్రిజ్‌లు ఎక్కువ విద్యుత్ ఆదా చేస్తాయి. అయినప్పటికీ తక్కువ రేటింగ్‌లు ఉన్న పరికరాలతో పోలిస్తే ఇవి కొంత ఖరీదైనవి. కానీ విద్యుత్ ఆదా చేయడంలో మాత్రం ముందుంటాయి. అందువల్ల మీరు ఎప్పుడైనా ఫ్రిజ్‌ని కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు.. BEE 4 లేదా 5 స్టార్ రేటింగ్‌తో ఉన్న ఫ్రిజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి.

We’re now on WhatsApp : Click to Join

స్థలాన్ని చూసుకోండి

ఫ్రిజ్ కొనుక్కోవడానికి వెళ్లే ముందు ఇంట్లో ఫ్రిజ్ ఉంచే స్థలాన్ని ఎంపిక చేసుకోండి. ఆ స్థలంలో సరిపోయే ఫ్రిజ్ పరిమాణాన్ని నిర్ణయించండి. చాలా సార్లు పరిమాణాన్ని అంచనా వేయలేము. పెద్ద సైజు ఫ్రిజ్ తీసుకుంటాం. త‌క్కువ స్థ‌లంలో పెద్ద ఫ్రిజ్ పెడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది.

ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిజ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి

ఫ్రీజర్ లోపలి ఉపరితలంపై మంచు పేరుకుపోవడం తరచుగా కనిపిస్తుంది. ఈ ఐస్ కారణంగా ఫ్రీజర్ తలుపు తెరవడం కష్టంగా మారడమే కాకుండా వస్తువులను ఉంచడానికి చాలా తక్కువ స్థలం మిగిలి ఉంటుంది. ఈ ఐస్‌ను తొలగించడానికి రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేయాలి. ఫ్రీజర్ ఇలా ఫ్రీజ్ కాకుండా ఉండే ఫ్రిజ్‌లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఫ్రిజ్‌లను ఫ్రాస్ట్ ఫ్రీ అంటారు.

Exit mobile version