హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది స్లో పాయిజన్ లాంటింది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతుంది. దీనికి శాశ్వత నివారంటూ ఏదీ లేదు. మందులు కొన్ని ఆహారాలు లైఫ్ స్టైల్ ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. సాధారణ రక్తపోటు 120/80 గా పరిగణిస్తారు. అంతకుమించి ఉన్నట్లయితే…హైబీపీ కిందికి వస్తుంది. సకాలంలోచికిత్స అందించకపోతే…అది గుండెకు హాని కలిగిస్తుంది. అందుకే హైబీపీ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు, మరణాలు తగ్గించడానికి బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరమని పేర్కొంది.
అయితే ఆహారంలో ఎక్కువగా పొటాషియం, కాల్షియం వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. అయినప్పటికీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. బీపీని కంట్రోల్లో ఉంచే భారతీయ వంటకాలు మీకోసం…
1. జొన్న రోటిజోవర్:
దీనిని జోన్న అని కూడా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, ఫైబర్, ప్రొటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో అదనంగా ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నివారించడానికి సహాయపడుతుంది. గోధుమలతో పోల్చితే…ఇది మరింత సంతృప్తికరంగా ఉంటుంది.
2. దోసకాయ రైతా:
వేసవిలో దాహీరైతా తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో అదనంగా దోసకాయను చేర్చినట్లయితే మరింత రిఫ్రెష్ గాఉంటుంది. దోసకాయలో 95శాతం నీరు ఉంటుంది. ఇది మనల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు శరీరంలోని టాక్సిన్ ను దూరం చేస్తుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. దీన్ని పదినిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.
3. దహీ బిండి:
దహీ బిండి అనేది రాజస్థానీ వంటకం. దీన్ని తయారు చేయడం చాలా సులభం. కేవలం అర్దగంటలోనే ఈ దీన్ని తయారు చేయవచ్చు. బిండిలో రక్తపోటును నియంత్రించే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ వంటకం చేసేటప్పుడు వీలైనంత తక్కువగా నూనె ఉపయోగించడం మంచిది. ఎందుకంటే అధిక నూనె కూడా బీపీ వ్యాధిగ్రస్తులకు హానికరమే.
4. మూంగ్ దాల్ చిల్లా:
మూంగ్ అంటే పప్పు. పప్పులో ఫైబర్ , పొటాషియం, ఐరన్ అధిక మోతాదులోఉంటాయి. దేశీయ వంటకాల్లో ఇది చాలా ఫేమస్. చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇది అల్ఫాహారంలో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా మూంగ్ పప్పులో ఉల్లిపాయలు, మిరపకాలన కలిపి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.
5. రాజ్మా సలాడ్ :
రాజ్మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాజ్మా సలాడ్ ను తయారు చేయడానికి అరకప్పు రాజ్మా, ఉల్లిపాయలు, టమోటాలు, క్యాబేజీ, స్రింగ్ ఆనియన్స్ వాల్ నట్స్ , వేరుశనగలు అవసరం. నిమ్మరసం, ఉప్పు, మిరియాలు రుచికి కావాల్సనన్ని తీసుకుని ప్రయత్నించండి. రుచికరమైన రాజ్మా సలాడ్ ఇష్టంతో తినొచ్చు.