మ్యాగీ.. ఈ ఫుడ్ ని ఇష్టపడని వారు ఉండరేమో. కొంతమంది ఉదయాన్నే పిల్లలకు టిఫిన్ గా చేసి పెడితే మరి కొంతమంది సాయంత్రం సమయంలో స్నాక్స్ మాదిరిగా చేసిపెడుతూ ఉంటారు. అయితే మ్యాగీ తో ఎప్పుడు కేవలం మమ్యాగీని మాత్రమే తింటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు మ్యాగినే కాకుండా కాస్త వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ ఫుడ్ రెమిడి. మ్యాగీ తో ఎప్పుడైనా వడను తయారు చేశారా.. చేయకపోతే మ్యాగీతో వడ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాగీ వడకు కావాల్సినవి పదార్థాలు:
మ్యాగీ – 3
క్యారెట్ తురుము
బీట్‌రూట్ తురుము – పావు కప్పు
పచ్చిమిర్చి – సరిపడినన్ని
కొత్తిమీర తురుము – కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు – కొన్ని
కారం, పసుపు, గరం మసాలా – 1 టీ స్పూన్
పెరుగు – ఒక టేబుల్ స్పూన్
మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
మైదాపిండి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ తీసుకుకోవాలి. తరువాత ఉడికించుకున్న మ్యాగీ తీసుకొని అందులో క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు అన్నీ వేసి బాగా కలపాలి.
జోడించి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ తరువాత మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకోవాలి. మైదా తోపులో ముంచి, మ్యాగీ ముక్కల్లో దొర్లించి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ కూడా రెడీ.