SweetPotato Gulabjamun : చిలగడదుంపలతో గులాబ్ జామూన్.. టేస్ట్ యమ్మీ

శుభ్రంగా కడిగి ఉడికించిన చిలగడదుంపలను పైన పొట్టుతీసి పెట్టుకోవాలి. వాటిని చేతితోనే మెత్తగా చేసుకుని.. చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. అందులోనే యాలకుల పొడి, 2 స్పూన్ల మైదాపిండి, నెయ్యి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

Published By: HashtagU Telugu Desk
SweetPotato Gulabjamun

SweetPotato Gulabjamun

SweetPotato Gulabjamun : మనకు అన్ని పండ్లు, కూరగాయలు అన్ని సీజన్లలో లభించవు. అవి దొరికిన సీజన్లోనే తినాలి. అలాంటి కోవకు చెందినదే చిలగడదుంప. ఇది ఈ కాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. చవక కూడా. చిలగడదుంపల్ని కడిగి.. కాస్త ఉప్పేసి ఉడకబెట్టి తింటే.. చాలా బాగుంటుంది. అంతేకాదు.. స్వీట్ పొటాటోతో కొందరు కూర కూడా చేసుకుంటారు. సాంబార్ లోనూ వేసుకుంటారు. కానీ.. చిలగడదుంపతో మీరెప్పుడైనా స్వీట్ చేసుకుని తిన్నారా ? తినకపోతే ఇప్పుడు ట్రై చేయండి. చిలగడదుంపలతో చేసే గులాబ్ జామూన్.. మామూలు గులాబ్ జామూన్ కంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం.

స్వీట్ పొటాటో గులాబ్ జామూన్ కు కావలసిన పదార్థాలు

చిలగడదుంపలు – 3

బేకింగ్ సోడా – చిటికెడు

నీరు – 1 కప్పు

పంచదార – 1 కప్పు

నూనె – సరిపడ

నెయ్యి – 2 స్పూన్లు

యాలకులపొడి – 1.1/2 స్పూన్

మైదాపిండి – 2 స్పూన్లు

చిలగడదుంప గులాబ్ జామూన్ తయారీ విధానం

శుభ్రంగా కడిగి ఉడికించిన చిలగడదుంపలను పైన పొట్టుతీసి పెట్టుకోవాలి. వాటిని చేతితోనే మెత్తగా చేసుకుని.. చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. అందులోనే యాలకుల పొడి, 2 స్పూన్ల మైదాపిండి, నెయ్యి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఒకకప్పు నీటిని గిన్నెలో పోసి.. అందులో ఒక కప్పు చక్కెర సిరప్ వేసి మరిగించుకోవాలి. అందులోనే యాలకులపొడి వేసి తీగపాకం అయ్యేవరకూ మరిగించి చక్కెర సిరప్ ను రెడీ చేసుకోవాలి.

స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడిచేసుకోవాలి. చిలగడదుంపలతో చేసిన మిశ్రమాన్ని.. గులాబ్ జామూన్ సైజులో చుట్టుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించిన గులాబ్ జామూన్ లను చక్కెర సిరప్ లో వేసి.. 3 గంటలు అలాగే ఉండనివ్వాలి. అంతే స్వీట్ పొటాటో గులాబ్ జామూన్ రెడీ.

Also Read : Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి కారణాలు, లక్షణాలు

  Last Updated: 21 Jun 2024, 09:11 PM IST