Nose Hair Removal: ముక్కులో వెంట్రుకలు పీకేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 04:20 PM IST

చాలామంది ఈ ముక్కులో వెంట్రుకలు ఉండడం అన్నది అంద విహీనంగా భావించి వాటిని తొలగించేస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ముక్కులో ఉండే వెంటుకలు దుమ్మూదూళీ శ్వాస ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి. అయితే, కొందరికి ముక్కులో వెంటుకలు ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. దీంతో వాటిని పీకేస్తుంటారు. మరికొందరు ట్రిమ్ చేస్తారు. దీనివల్ల శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌లు సులభంగా చేరిపోతాయి. వైరస్‌లు శరీరంలోకి చేరకుండా మాస్క్ ఎలా అడ్డుకుంటుందో, ముక్కులోని వెంట్రుకలు కూడా అదే విధంగా రక్షణ కల్పిస్తాయి.

ముక్కులోని వెంటుకలు తొలగించడం అస్సలు మంచిది కాదు. ముక్కు వెంటుకలు మన శరీరాన్ని రక్షిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. నాసికా రంథ్రం లోపల ఉండే ఈ వెంటుకలు అందాన్ని తగ్గిస్తాయి. అందంతో పోల్చుకుంటే ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీకడం గానీ, మొదళ్ల వరకు కత్తిరించడం గానీ చేయకూడదు. ముక్కులోని వెంటుకలను పీకినా, కత్తిరించినా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. ముక్కు వెంటుకలు పీకిన తర్వాత వాటి కుదుళ్ల వద్ద చర్మం తెరుచుకుంటాయి. అవి మనం పీల్చే దుమ్ము, దూళిలోని బ్యాక్టీరియా ఆ రంథ్రాల్లోకి చొచ్చుకెళ్లే ప్రమాదం ఉందట. ఫలితంగా అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడి ఊపిరితీత్తుల్లోకి చేరుకోవచ్చు. కాగా మన ముఖంలోని ఒక భాగాన్ని డేంజర్ ట్రయాంగిల్ అంటారు.

ఇది ముక్కుపై నుంచి నోటి రెండు వైపులా ఉండే ప్రాంతం. ఇందులో రక్త నాళాలు, నరాలు ఉంటాయి. అవి మెదడుకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ముక్కులోని వెంటుకలను కత్తిరిస్తే డేంజర్ ట్రయాంగిల్‌లోని రక్త నాళాలపై ప్రభావం పడుతుంది. ఇది ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చు..ముక్కు వెంటుకల కుదుళ్ల వద్ద ఏర్పడే రంథ్రం ద్వారా రక్త నాళాల ద్వారా ప్రమాదకర బ్యాక్టరీయా మెదడుకు చేరవచ్చు. మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఈ వ్యాప్తి మరింత వేగంగా ఉండవచ్చు. కొందరిలో రక్త సరఫరా సిరలు గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని కావెర్నస్ సైనస్ థ్రోంబోసిస్ అంటారు.

అదే జరిగితే మెదడుపై ఒత్తిడి ఏర్పడవచ్చు. ఈ పరిస్థితి మరణానికి దారితీయవచ్చు. ముక్కు వద్ద మొటిమలు, పుండ్లు ఉన్నట్లయితే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండవచ్చు. మీ ముక్కు లోపల ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడండి. అలాగే, వెంటుకలు బాగా పెరిగినట్లయితే కత్తెర లేదా ట్రిమ్మర్‌తో కత్తిరించుకోండి. ఆ వెంటుకలను పీకేందుకు అస్సలు ప్రయత్నించొద్దు. ముక్క లోపల పదునైనా ఆయుధాలు, పొడవైన గోర్లను చొప్పించకూడదు. ముక్కులో వేలు పెట్టుకొనే అలవాటు కూడా మంచిది కాదు.