బీర్ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు. బీరు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. కాబట్టి బీరు తాగినా కూడా లిమిట్ గా తాగమని వైద్యులు చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. బీరు ఆరోగ్యానికి అలాగే జుట్టుకి ఎంతో మేలు చేస్తుందట. అయితే ఒక గ్లాసు చల్లటి బీరులో ఐసు ముక్కలను ఎక్కువగా కలుపుకొని తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుందట.
మందుతో పోల్చుకుంటే బీరు తాగినప్పుడు హ్యాంగోవర్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా బీరును మితంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే వారం అంత కలిపి అయినా సరే 385 గ్రాముల బీరును తీసుకోవాలని చెబుతున్నారు. ఇది డయాబెటిస్ అలాగే మూత్రపిండాల ఆరోగ్యం పై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందట. మహిళలు 16 గ్రాములు, పురుషులు 28 గ్రాముల వరకు ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితమట. అయితే బార్లీతో తయారు చేసిన బీర్ లో విటమిన్ బి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
దీనిలో శోథ నిరోధక, ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు బీర్ తో స్కిన్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ముడతలు, సన్నని గీతలు తగ్గిపోతాయి. చర్మం ఆయిలీగా ఉండి తరచూ మొటిమలు అయ్యే వారికి కూడా బీర్ ప్రయోజనకరంగా ఉంటాయి. బీరు మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుందట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బీర్ యాంటీ ఏజింగ్ డ్రింక్ గా కూడా పరిగణించబడుతుందట. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మంపై ముడతలు, సన్నని గీతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయట. ముఖంపై ఉన్న సన్నని గీతలను తొలగించుకోవాలంటే ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ కంటే పార్టీలో ఒక గ్లాసు బీర్ తీసుకోవడం మంచిదట.
వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది మహిళల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు పోషకాహార లోపం, టానింగ్, ఎండవల్ల కూడా మచ్చలు అవుతుంటాయి. స్కిన్ టోన్ కూడా మారుతుంది. అయితే బీర్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. బీర్ లో ఈస్ట్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి చర్మం ఒకే రంగులో ఉంచడానికి సహాయపడతాయి. మీరు ఎండలో ఎక్కువగా ఉండటం, ఎప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు ఉండటం వల్ల మీ చర్మం వేగంగా వృద్ధాప్యానికి గురవుతుంది. చర్మం బయటి పొరలోని కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. దీని వల్ల మీ చర్మం మసకబారడం, నీరసంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే బీర్ లో ఉండే ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయట. అలాగే చర్మం మరింత శక్తివంతంగా, యవ్వనంగా కనిపిస్తుందట.