వివాహేతర సంబంధాలు (Illegal Affair) అనేవి ఇటీవల చాల కామన్ గా మారిపోయాయి. భర్త , భార్య ఉన్నప్పటికీ వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని చాలామంది తమ కాపురాలను పాడుచేసుకోవడమే కాకుండా తమ బిడ్డలా భవిష్యత్ ను రోడ్డు పాలుచేస్తున్నారు. అంతే కాదు ఈ అక్రమ సంబంధాల కారణంగా కొన్ని కొన్ని సార్లు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు తీయడం కూడా చేస్తున్నారు. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు..గతంలో ప్రేమ వ్యవహారాలు, వేదింపులు , భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోవడం, శృంగారపరంగా తృప్తి లేకపోవడం, ఆకర్షణ ఇలాంటి పలు కారణాల కారణంగా ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
* ప్రేమ వ్యవహారాలు : ఇటీవల పెళ్ళికి ముందు ప్రేమించుకోవడం అనేది కామన్..కానీ పెళ్లి తర్వాత వాటిని మరచిపోయి భర్త లేదా భార్య తో ప్రేమగా , సంతోషంగా ఉండాలి. అంతే కానీ గతంలో ప్రేమ గురించి ఆలోచించడం..మాజీ లవర్ తో మాట్లాడడం, కలవడం వంటివి చేయడం వల్ల..వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది.
* వేదింపులు : భార్యాభర్తలు నిత్యం హ్యాపీగా కలిసి అన్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. అంతే కానీ నిత్యం ఒకరి ఫై ఒకరు నిందలు వేసుకోవడం, అరుసుకోవడం , గొడవలు పెట్టుకోవడం, వేధింపులకు గురి చేయడం వంటివి కూడా వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది.
* భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోవడం : భార్యాభర్తలు మధ్య ప్రేమ అనేది ఎప్పుడు ఉండాలి. పెళ్లి అయినా కొత్తలో మాత్రమే ప్రేమగా చూసుకోవడం..పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉండడం, సరిగా మాట్లాడుకోకపోవడం, తరుచు గొడవలు పడడం వంటివి కూడా వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది.
* శృంగారపరంగా తృప్తి లేకపోవడం : కోరికలు అనేవి ఆడ, మగవారికి ఒకేలా ఉంటాయి. కానీ, పురుషులు వాటిని త్వరగా బయటపెడతారు.. ఆడవారు మాత్రం ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికైనా సరే శృంగారపరంగా తృప్తిగా లేకపోతే కూడా వేరే సంబంధం పెట్టుకోవాలనుకుంటారు. ఇలా పలు కారణాల కారణంగా వివాహేతర సంబంధాలకు దారితీస్తుంటాయి. అందుకే ఫై కారణాలు లేని వారు నిత్యం హ్యాపీగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
Read Also : Prabhas : ఇన్‌స్టాలో ప్రభాస్ ఇంటరెస్టింగ్ పోస్ట్.. పెళ్లి గురించేనా..?