Uggani : రాయలసీమ స్పెషల్ ఉగ్గాని.. ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకోండి..

మీరు ఎప్పుడైనా ఉగ్గాని గురించి విన్నారా? దాని టేస్ట్ ట్రై చేశారా? చేయకపోతే ఈ తయారుచేసే విధానం చూసి చేసుకొని తినేయండి.

Published By: HashtagU Telugu Desk
Rayalaseema Special Uggani simple Home Recipe Prepare like this Uggani

Rayalaseema Special Uggani simple Home Recipe Prepare like this Uggani

ఉగ్గాని(Uggani) అనేది కర్ణాటక(Karnataka)లో కనిపెట్టిన స్నాక్, టిఫిన్ ఐటెమ్ కానీ ఇది రాయలసీమలో(Rayalaseema) ఫేమస్ గా మారింది. రాయలసీమ ఉగ్గాని అంటే మంచి ఫేమస్ వంటకం. హోటల్స్ లో కూడా రాయలసీమ ఉగ్గాని అనే పేరుతోనే చాలా చోట్ల అమ్ముతారు. మీరు ఎప్పుడైనా ఉగ్గాని గురించి విన్నారా? దాని టేస్ట్ ట్రై చేశారా? చేయకపోతే ఈ తయారుచేసే విధానం చూసి చేసుకొని తినేయండి.

రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీకి కావలసిన పదార్థాలు:-

* బొరుగులు(మరమరాలు) 250 గ్రాములు
* టమాటాలు అర కప్పు
* ఉల్లిపాయ ఒకటి తరిగినది
* జీలకర్ర ఒక స్పూన్
* సాయిపప్పు ఒక స్పూన్
* ఆవాలు ఒక స్పూన్
* పచ్చిమిర్చి ఐదు
* ఎండుమిర్చి రెండు
* కరివేపాకు నాలుగు రెబ్బలు
* ఉప్పు తగినంత
* కారం అర స్పూన్
* నూనె రెండు స్పూన్లు
* పుట్నాల పప్పు అర కప్పు
* ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు
* కొత్తిమీర కొద్దిగా

మొదట బొరుగులను ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాలి. ఐదు నిముషాలు అయిన తరువాత బొరుగులను గట్టిగా నీళ్లు లేకుండా పిండి కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి కలిపి మిక్సి లో మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకును కచ్చాపచ్చాగా రోటిలో దంచుకొని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని దానిలో నూనె వేసి జీలకర్ర, సాయిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. అవి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. దంచి ఉంచుకున్న పచ్చిమిర్చి ముద్ద, పసుపు, కారం వేసుకొని కలబెట్టుకోవాలి. అవన్నీ పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి. టమాటాలు మెత్తబడిన తరువాత నానబెట్టిన బొరుగులు, మిక్సి పట్టుకొని ఉంచుకున్న పుట్నాలపొడిని, సరిపడ ఉప్పు వేసి కలబెట్టుకోవాలి. బొరుగులు ఉడికిన తరువాత చివరకు కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి మిరపకాయ బజ్జి కాంబినేషన్ లో పెట్టి తింటే ఇంకా బాగుంటుంది. బయట హోటల్స్ లో కూడా ఇలాగే మిరపకాయ బజ్జి పెట్టి ఇస్తారు ఉగ్గానికి.

 

Also Read : Coriander Seeds: ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

  Last Updated: 17 Sep 2023, 09:55 PM IST