మామూలుగా మనకు వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి ఏడాదిలో కేవలం వేసవిలో మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఈ వేసవికాలంలో దొరికే పచ్చి మామిడికాయ పండు మామిడికాయలతో రకరకాల వంటలు తయారు చేసుకునే తింటూ ఉంటారు. అటువంటి వాటిలో పచ్చి మామిడికాయ చట్నీ కూడా ఒకటి. వేడివేడి అన్నంలోకి పచ్చి మామిడికాయ చట్నీ కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.. మరి ఈ పచ్చి మామిడికాయ చట్నీనీ ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..
కావాల్సిన పదార్థాలు:
మామిడి కాయ – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
అల్లం తరుగు – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – రెండు
పచ్చి మిర్చి – రెండు
రాతి ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా పచ్చి మామిడిని తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ కోసుకోవాలి. ఒక గిన్నెలో మామిడి ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, రాతి ఉప్పు, ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉడికించాలి. వాటిని చల్లార్చి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెల్లోకి ఆ మిశ్రమాన్ని తీసి, తాళింపు వేసుకోవాలి. దీన్ని ఇడ్లీ, దోశెతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కూడా ఈ చట్నీ ఎంతో బాగా ఉంటుంది.