Site icon HashtagU Telugu

Raw Coconut: పచ్చికొబ్బరి తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి..

raw coconut benefits

raw coconut benefits

Raw Coconut: కొబ్బరి నీళ్లు, కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో కొబ్బరితో రకరకాల వెరైటీలు చేసుకుంటుంటాం. కొబ్బరిని కోరు తీసి కూర కూడా వండుతారు. సాంబార్ లో కొబ్బరి తురుము వేస్తే ఆ టేస్టే వేరు. పచ్చికొబ్బరి రోటి పచ్చడి అయితే.. తలచుకుంటేనే ఎవరికైనా నోరూరాల్సిందే. ప్రత్యేకంగా పండుగ రోజుల్లో కొబ్బరి బెల్లం కలిపి లౌజు చేస్తారు. ఇది ఇంకా రుచిగా ఉంటుంది. కానీ.. కొందరు పచ్చికొబ్బరి తింటే దగ్గు వస్తుందని భయపడుతుంటారు. నిజానికి పచ్చికొబ్బరి తినడం వల్ల చాలా పోషకాలు లభిస్తాయట. అలాగని అదేపనిగా తినకూడదు.

పచ్చికొబ్బరిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ గుణాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే విటమిన్ బీ1, బీ9, బీ5 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

పచ్చికొబ్బరిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు అధికంగా లభిస్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది.

పచ్చికొబ్బరి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యల బారిన పడకుండా ఉంచుతుంది. మెదడు పనితీరును మరింత మెరుగ్గా చేస్తుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు పచ్చికొబ్బరి, బెల్లం కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలు బలంగా ఉండాలంటే.. పచ్చికొబ్బరి బెల్లం తీసుకోవడం బెటర్.

కేవలం శరీరంలోని అవయవాలకే కాదు.. పైన ఉండే చర్మానికీ పచ్చికొబ్బరి మంచిది. చర్మాన్ని అందంగా కాంతివంతంగా ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా పచ్చికొబ్బరిని తినొచ్చు. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసి తీసిన పాలను కూరల్లో వాడటం వల్ల వాటిలోని పోషకాలు అందుతాయి.

పిల్లలు పచ్చికొబ్బరిని తినడానికి ఇష్టపడకపోతే.. దానితోనే స్నాక్స్ చేసి పెట్టొచ్చు. కొబ్బరి బిస్కెట్లు, కొబ్బరి బూరెలు, కొబ్బరి అన్నం.. కొబ్బరి పలావ్ వంటి రకరకాల వెరైటీలను చేసుకోవచ్చు.

Exit mobile version