Site icon HashtagU Telugu

Ravva Appalu: రవ్వ అప్పాలు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?

Mixcollage 12 Feb 2024 05 06 Pm 4661

Mixcollage 12 Feb 2024 05 06 Pm 4661

మామూలుగా మనకు ఎప్పుడూ ఒకే విధమైన స్వీట్స్ తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏవైనా సరికొత్తగా స్వీట్స్ ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే స్వీట్స్ బ్రేకరీలో దొరికే కాకుండా కొంతమంది ఇంట్లోనే తయారు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏవైనా సరికొత్తగా స్వీట్ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే టేస్టీగా రవ్వ అప్పాలు చేసుకోండిలా. మరి దానిని ఎలా చేయాలి అందుకు ఏ పదార్థాలు కావాలి అన్న వివరాల్లోకి వెళితే..

రవ్వ అప్పాలు కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ- 1 కప్పు
చక్కెర -3/4 కప్పు
యాలకులు -3
నెయ్యి-5 టేబుల్ స్పూన్లు
నూనె-సరిపడంత

రవ్వ అప్పాలు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోయాలి. వాటిని మరిగించాలి. మరుగుతున్నప్పుడు నెయ్యి వేసి రెండు నిమిషాలు తర్వాత రవ్వ వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి. సన్నని మంటమీద ఐదు నిమిషాలపాటు మూతపెట్టి దించేయాలి. చల్లారనిచ్చి అందులో చక్కెర, యాలకులపొడి, వేసి కలపాలి. దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టాలి. సన్నని మంటమీద రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. కలుపుతున్నప్పుడు తప్పా మిగతా సమయాల్లో మూతపెట్టి ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేశారు. చేతికి నెయ్యి రాసుకుని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి అందులో అప్పాలను వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించాలి.

Exit mobile version