Site icon HashtagU Telugu

Rava Coconut Upma: ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి ఉప్మా ఇంట్లో తయారు చేసుకోండిలా?

Rava Coconut Upma

Rava Coconut Upma

మామూలుగా మనలో చాలామంది ఉప్మాను తినడానికి అంతగా ఇష్టపడరు. కొంతమందికి ఉప్మా తింటే అరగదని చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ రవ్వ ఉప్మా మాత్రమే కాకుండా అందులో కాస్త వెరైటీగా చేస్తే చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా రవ్వ కొబ్బరి ఉప్మా తయారు చేశారా. ఎప్పుడు తినకపోతే రవ్వ ఉప్మా కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలి అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రవ్వ కొబ్బరి ఉప్మా కావలసిన పదార్థాలు:

గోధుమ రవ్వ – 1 కప్పు
ఆవాలు – అర టీ స్పూను
మినపపప్పు – 1 టీ స్పూను
పచ్చి శనగపప్పు – 1 టీ స్పూను
ఎండు మిరపకాయలు – 2
కరివేపాకు – కొంచెం
ఉల్లిపాయ – ఒకటి
పచ్చి మిరపకాయలు – రెండు
కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
నెయ్యి – 2 స్పూన్లు
వంట నూనె – 2 స్పూన్లు
నీరు – ఒకటిన్నర కప్పు
క్యారెట్ ముక్కలు – ఒక చిన్న క్యారెట్
కొబ్బరి ముక్కలు – చిన్నవి 10
అల్లం – కొద్దిగా

రవ్వ కొబ్బరి ఉప్మా తయారీ విధానం:

ఇందుకోసం మొదట గోధుమరవ్వ బాణలీలో వేసుకొని, అందులో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇక రవ్వ రంగు మారుతున్న సమయంలో పొయ్యి మీద నుంచి దించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె, ఆవాలు, మినప, శనగపప్పులు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, కేరెట్ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి. ఆ తర్వాత అందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొబ్బరి కోరు అందులో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతూ వుండగానే రవ్వని ధారగా పోస్తూ కలుపుకోవాలి. రవ్వ కొద్దిసేపు ఉడికిన తర్వాత, మిగిలిన నెయ్యి అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ని 5 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచాలి. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత మూత తీయకుండా ఒక పది నిమిషాలు ఉంచాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి ఉప్మా రెడీ.

Exit mobile version