Site icon HashtagU Telugu

Rashmika and her diet: రష్మికా డైట్ సీక్రెట్స్ తెలుస్తే…షాకవ్వాల్సిందే…!!

Rashmika Imresizer

Rashmika Imresizer

సామీ సామీ అంటూ దేశం మొత్తాన్ని తన చూపులతో బాణం వేసి ఆకట్టుకున్న నేషనల్ క్రష్…రష్మిక మందానా అంటే కుర్రకారు పడిచస్తారు. ఇక అమ్మాయిలు అయితే అమ్మడు బ్యూటీ సీక్రెట్స్ ఏంటా అని ఇంటర్నెట్ అంతా వెతికేస్తుంటారు. అయితే ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన రష్మిక, ఫుడ్ విషయంలో పెద్దగా పట్టింపులు ఏమీ ఉండకపోయినా షూటింగ్ సమయంలో మాత్రం నోటికి తాళం వేసుకుంటుంది.

షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒక రోజంతా తాను ఏమి తినే డైట్ విశేషాలను పంచుకోవడానికి ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అది తెగ హల్ చల్ చేస్తోంది. బ్రేక్ ఫాస్ట్ నుంచి లంచ్ వరకూ ఆమె డైట్ షెడ్యూల్ చూపించే చిన్న వీడియోలో, మార్నింగ్ ఐస్‌డ్ కాఫీతో తన రోజును ప్రారంభించింది. తర్వాత సెలెరీ జ్యూస్‌ తాగింది. ఆ తర్వాత ఆల్మండ్ బటర్‌, వోట్స్ తో బ్రేక్ ఫాస్ట్ ముగించింది. తర్వాత విరామం గ్రీన్ టీ తాగగా, ఇక లంచ్ కోసం చికెన్, ఉడికించిన బంగాళ దుంపలతో చేసిన సలాడ్ తీసుకుంది.

పుష్ప: ది రైజ్ తో జాతీయ స్థాయిలో సెన్సేషన్ గా నిలిచి రష్మికా, తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లులో చివరిసారిగా కనిపించింది. రష్మిక మందన్న త్వరలో రెండు అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో కనిపించనుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ్ స్టార్ హీరో విజయ్‌లతో ద్విభాషా చిత్రంతో బిజీగా ఉంది. దీంత పాటు పుష్ప సీక్వెల్‌లో కనిపించనుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో హను రాఘవపూడి యొక్క సీతా రామం చిత్రంలో కూడా రష్మికా అతిధి పాత్ర పోషిస్తోంది. రష్మిక త్వరలో మిషన్ మజ్ను, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించనుంది. అలాగే యానిమల్‌ సినిమాలో రణబీర్ కపూర్‌తో కలిసి నటించనుంది.

Exit mobile version