Rajasthani Chicken Curry: ఎంతో స్పైసీగా ఉండే రాజస్థానీ చికెన్ కర్రీ.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?

మామూలుగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వంటకాలు ఫేమస్ అవుతూ ఉంటాయి. దీంతో చాలామంది ఆ ప్రదేశంలో వంటకాలను ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటి

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 05:30 PM IST

మామూలుగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వంటకాలు ఫేమస్ అవుతూ ఉంటాయి. దీంతో చాలామంది ఆ ప్రదేశంలో వంటకాలను ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో చాలామంది ఇష్టపడే రెసిపీ రాజస్థానీ చికెన్ కర్రీ. మరి ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ఇంట్లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాజస్థానీ చికెన్ కర్రీకీ కావలసినవి :

చికెన్ – అరకేజీ
ఉల్లిపాయలు – రెండు
పెరుగు – ఒక కప్పు
అల్లం పేస్ట్ – ఒక స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
ఎండు మిర్చి – నాలుగు
లవంగాలు – ఐదు
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – అంగుళం ముక్క
మిరియాలు – 8
జీరా – ఒక స్పూన్
కొత్తిమిర పౌడర్ – 3 స్పూన్లు
సాల్ట్ సరిపడా
కారం – 4స్పూన్లు
పసుపు – అరస్పూన్
చికెన్ మసాలా- ఒక స్పూన్
నిమ్మరసం – ఒక స్పూన్
ఆయిల్- సరిపడగా

రాజస్థానీ చికెన్ కర్రీ తయారీ విధానం :

ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నిమ్మరసం, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసి లవంగాలు, మిరియాలు, జీరా, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించి చల్లారక వాటిని మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ వేసి అందులో పసుపు, కారం, కొత్తిమిర పౌడర్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. పది నిముషాల తరువాత గ్రైండ్ చేసుకున్నమసాలా పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించి అందులో పెరుగు, చికెన్ మసాలా వేసి కలిపి మూతపెట్టి ఒక పదినిముషాలు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ చికెన్ కర్రీ రెడీ.