వర్షాకాలం మొదలవ్వగానే వాతావరణ మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశముంది. ఈ సమయంలో అధిక తేమ, చల్లదనం వలెనే వ్యాధులను వ్యాపింపజేసే క్రిమికీటకాల సంఖ్య పెరుగుతుంది. అందుకే శుభ్రత, మంచి ఆహార నియమాలు పాటించకపోతే, వైరల్ ఫీవర్లు, జలుబు, జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు వెంటనే వస్తాయి. శుద్ధి చేసిన నీరు తాగడం, ఉడికించిన ఆహారమే తీసుకోవడం, బయటి ఆహారం పూర్తిగా మానేయడం చాలా అవసరం అని డాక్టర్స్ చెపుతుంటారు.
వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పని చేయడం వల్ల, జీర్ణించుకోవడానికి తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. వేడి ఆహారం తీసుకోవడం శరీరానికి తగిన వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అల్లం, పసుపు, వేప, మెంతులు, కాకరకాయ వంటి చేదుపదార్థాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. స్ట్రీట్ ఫుడ్స్, చాట్, బజ్జీలు, పానీపూరీలు వంటి వాటిపై ఈగలు, దోమలు వాలడం వల్ల బ్యాక్టీరియా చేరి విషపూరితంగా మారతాయి. అందుకే ఎంత రుచికరంగా ఉన్నా బయట ఆహారాన్ని పూర్తిగా నివారించాలి.
Telangana : కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. 41లక్షల మందికి రేషన్‌కార్డులు జారీ
ఈ కాలంలో సీఫుడ్, రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే వర్షాకాలంలో ఇవి తాజాగానూ దొరకడం కష్టమే. ఎక్కువకాలం నిల్వ ఉంచిన వాటిలో బాక్టీరియా వృద్ధి చెందడం వల్ల ఆహార విషబాధకు గురికావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఉరుగాయలు, పెరుగు వంటివి తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. సో ఈ విషయాలను గుర్తుంచుకుని వర్షాకాలంలో శుభ్రమైన, వేడి మరియు తక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే హాస్పటల్ పాలై జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది.