Site icon HashtagU Telugu

Ragi Dosa: రాగి దోశలు.. ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకుని మరీ తినేయాల్సిందే?

Mixcollage 26 Jan 2024 05 14 Pm 6657

Mixcollage 26 Jan 2024 05 14 Pm 6657

మనం దోశలో ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ప్లెయిన్ దోస,కారం దోస, ఎగ్ దోస, పెసరట్టు, ఉప్మా దోసే ఇలా ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ఇది చాలా వరకు వీటిని బియ్యప్పిండితో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా రాగి పిండితో తయారుచేసిన రాగి దోశ తిన్నారా. ఎప్పుడు తినకపోతే రాగి దోశ ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాగి దోశలకు కావాల్సిన పదార్థాలు:

రాగిపిండి – 1 కప్పు
రవ్వ – పావు కప్పు
బియ్యం పిండి- 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – పావు కప్పు

రాగి దోశ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని వేసుకోవాలి..తర్వాత అందులో రవ్వ, బియ్యంపిండి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత తాగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దోశ పిండి వలె కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంటపాటు నానబెట్టుకోవాలి. పిండి చక్కగా నానిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం కొద్దిగా వేడయ్యాక నూనె వేసి తుడుచుకొను దోశ వేసేటప్పుడు పెనం కొద్దిగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే దోశ పెనంకు అంటుకుపోయి సరిగ్గా రాదు. ఇప్పుడు పిండిని తీసుకుని దోశ వలె గుండ్రంగా వేసుకోవాలి. ఈ దోశ మరీ పలుచగా రాదు. దోశ తడి ఆరిన తర్వాత నూనె వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా దోసని బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ.

Exit mobile version