Site icon HashtagU Telugu

Ragi Ambali: శరీరానికి చలువ చేసే రాగి అంబలి.. తయారు చేయండిలా?

Mixcollage 28 Dec 2023 06 44 Pm 1322

Mixcollage 28 Dec 2023 06 44 Pm 1322

పూర్వకాలంలో మన పెద్దలు అంబలి చేసుకొని తాగేవారు. కానీ రాను రాను ఈ అంబలి తాగే వారే కరువయ్యారు. అయితే అప్పట్లో రాగి ముద్దతో అంబలి చేసుకొని దానిని ఉదయాన్నే తాగేవారు. కానీ ఇప్పుడు మనం రాగి అంబలిని మరొక విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాగి అంబలికి కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు – 1/2
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు -1/2 కప్పు
కొత్తమీర – సరిపడా
మంచి నీళ్లు – 2 కప్పులు

రాగి అంబలి తయారీ విధానం:

రాగి పిండిని మీడియం మంట మీద సువాసన వచ్చే వరకు పొడిగా వేయించాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి నీటిని మరిగించాలి. మంచి జీర్ణక్రియ కోసం మీరు అందులో చిటికెడు ఇంగువను జోడించాలి. క్రమంగా రాగి పిండిని వేసి ముద్దలు రాకుండా కలుపుతూ ఉండాలి. అలా పేస్ట్ లా అయ్యే వరకు బాగా కలపాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అందులో ఇప్పుడు పెరుగును పలుచన చేయడానికి, అందులో కొంచెం నీరు చిలక్కొట్టాలి. ఒక గ్లాసులో రాగి ముద్దను తీసుకుని, అందులో పెరుగు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే రాగి అంబలి రెడీ.