Site icon HashtagU Telugu

‎Chia Seeds: చియాసీడ్స్‌తో ఇలా చేస్తే చాలు.. సీరమ్ తో పనిలేకుండా మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!

Chia Seeds

Chia Seeds

Chia Seeds: మామూలుగా అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది న్యాచురల్ పద్ధతులు పాటిస్తే మరి కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాంతో ముఖం మరింత దారుణంగా తయారవుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్ని న్యాచురల్ బ్యూటీ టిప్స్ ని పాటిస్తే మెరిసిపోయే అందమైన చర్మం మీ సొంతం అవడం ఖాయం అని చెబుతున్నారు.

‎ అలాగే వీటిని ఉపయోగించడం వల్ల ఖరీదైన సీరమ్‌ లతో పని ఉండదట. దీనికోసం ఏమీ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం చియా సీడ్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి. నిర్జలీకరణం వల్ల చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు చియా సీడ్స్‌తో సీరమ్ తయారు చేసుకుని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం తేమ కలిగి ఉంటుందట. వీటితోపాటు చర్మానికి సంబంధించిన చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. కాగా నానబెట్టిన చియా సీడ్స్ జెల్‌ ను మీరు ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం బొద్దుగా, మృదువుగా, తాజాగా కనిపిస్తుందట.

‎కాలుష్యం, ఒత్తిడి వంటి వాటి కారణంగా చర్మం పై ప్రభావం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి చియా సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చర్మానికి కొల్లాజెన్ చాలా అవసరం. కానీ, వయసు పెరిగే కొద్దీ అది క్షీణించడం ప్రారంభమవుతుంది. చియాలో కొల్లాజెన్ ఉండదు, కానీ శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడే పోషకాలు ఇందులో ఉంటాయి. చియా సీడ్స్ పొడిలో గ్రీక్ యోగర్ట్ కలిపి ముఖానికి రాసుకోవాలి.

‎ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ టోన్ బాగుంటుందట. అలాగే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ లో తేనె, నిమ్మరసం కలిపి స్క్రబ్ చేసినట్లయితే మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందట. అదేవిధంగా చియా సీడ్స్ జెల్‌ లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. అలాగే చియా సీడ్స్‌లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే ముఖం తేమగా అందంగా మారుతుందట. చియా సీడ్స్‌ ను నీటిలో నానబెట్టి ఆ నీటిని రోజు తాగితే చర్మం చాలా బాగుంటుందట. ముఖం కూడా కాంతివంతంగా, అందంగా మారుతుందని చెబుతున్నారు.

Exit mobile version