Fight With Partner : భార్యాభర్తల గొడవ.. ఆ టైంలో ఈ పదాలు వాడొద్దు సుమా!

Fight With Partner : భార్యాభర్తల  మధ్య గొడవలు జరగడం సహజం. అయితే గొడవలు జరిగిన టైంలో వాడే పదాలు చాలా కీలకం.

Published By: HashtagU Telugu Desk
Fight With Partner

Fight With Partner

Fight With Partner : భార్యాభర్తల  మధ్య గొడవలు జరగడం సహజం. అయితే గొడవలు జరిగిన టైంలో వాడే పదాలు చాలా కీలకం. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకునే పదాల ఆధారంగా ఆ గొడవ పెరుగుతుందా ? తగ్గుతుందా ? అనేది డిసైడ్ అవుతుంది. ఆ గొడవను మరింత పెంచొద్దని భావించేవారు.. తేలికపాటి పదాలనే లైఫ్ పార్ట్నర్‌పై ప్రయోగిస్తారు. గొడవను పెంచాలని అనుకున్నప్పుడు లేదా ఆవేశంలో ఊగిపోతున్నప్పుడు వివాదాస్పద పదజాలాన్ని వాడటం మొదలుపెడతారు. ఇబ్బందికర పదాలను వాడితే.. ఎదుటివారి ఈగో హర్ట్ అవుతుంది. ఆవేశం కూడా రెట్టింపు అవుతుంది.  అందుకే భార్యాభర్తలు గొడవ(Fight With Partner) జరుగుతున్న టైంలో పదాలను ఆచితూచి వాడటం బెటర్.

We’re now on WhatsApp. Click to Join.

  • గొడవ జరుగుతున్న క్రమంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధారాలు లేని నిందలు వేసుకోవడం మానుకోవాలి.
  • తప్పంతా నీదే అని చెప్పడం మంచిది కాదు. దీనివల్ల గొడవ ఇంకా పెరుగుతుంది.
  • ఒకరినొకరు నిందించుకుంటే.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది.
  • మీ భాగస్వామి ఏదైనా పొరపాటు చేయగానే .. ‘‘నేను నీకు ముందే చెప్పా..’’ అనే పదం వాడొద్దు. ఇది ఎదుటి వారిలో ఇరిటేషన్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ వారివారి అవగాహన స్థాయి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని మనం గుర్తించాలి.
  • జరిగిన తప్పులను భూతద్దంలో చూపించడం ఆపేసి.. అలా జరగకుండా ఏం చేయాలనే సూచనను సున్నితంగా, గౌరవపూర్వకంగా అందించడంపై దృష్టిపెడితే గొడవ పెరగకుండా ఉంటుంది.
  • భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు.. వీరిలో ఎవరో ఒకరు ‘కూల్ కూల్’ అనే పదాలను కూడా వాడకపోవడమే మంచిది. దీని ఉద్దేశం  మంచిదే. కానీ ఇది ఆ టైంలో అవతలి వ్యక్తి ఎమోషన్‌కు మ్యాచ్ కాకపోవచ్చు. ‘కూల్ కూల్’ అనే పదాలు అవతలి వారి ఎమోషన్స్‌ను ఆటపట్టించేలా కనిపించే రిస్క్ ఉంది.
  • వాదన ఆపేసి.. ఎదుటి వారి మాటలు వినండి. వారి ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణకు తలుపులు తెరుచుకుంటాయి. భరోసాను అందించేలా మాట్లాడితే ఉద్రిక్తతలు చల్లారుతాయి.
  • ఒకరిపై ఒకరు సానుభూతి, అవగాహనతో నడుచుకుంటే.. భార్యాభర్తల మధ్య చీలిక ఏర్పడే ఛాన్స్  ఉండదు.
  Last Updated: 30 Dec 2023, 09:28 AM IST