Sleep: మీ దిండు కింద వీటిలో ఒకదాన్ని ఉంచండి.. మంచి నిద్రపడుతుంది

రాత్రి నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కొన్ని మార్పుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

రాత్రి నిద్ర (Sleep) రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కొన్ని మార్పుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం మీరు నిద్రపోయే ముందు దిండు కింద కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచాలి. నిద్ర అనేది మన మెదడు, శరీరానికి సంబంధించినది. అందుకే ప్రతి వ్యక్తికి నిద్ర చాలా ముఖ్యం. రోజూ 7 – 8 గంటల పాటు తగినంత నిద్రపోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి కారణంగా మనం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. దీని పర్యవసానంగా మీరు మీ పనిపై ఫోకస్ చేయలేరు.

అధిక అలసట, ఆందోళన, ఒత్తిడి, శారీరక బలహీనత, అనారోగ్యం, పగటిపూట నిద్రపోవడం వంటి వివిధ కారణాల వల్ల నిద్ర (Sleep) రాకపోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం వాస్తు దోషం కూడా అయి ఉండొచ్చు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. వీటిని చేసిన తర్వాత మీరు ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. వాస్తు శాస్త్రంలో దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పబడ్డాయి. ఈ వస్తువులలో ఒకదాన్ని దిండు కింద ఉంచడం ద్వారా.. మీరు మంచి నిద్ర పొందుతారు.

సుందరకాండ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు రాత్రిపూట నిద్రపోలేకపోతే, చెడు కలలు లేదా తెలియని భయం కారణంగా నిద్రించడానికి ఇబ్బంది ఉంటే, నిద్రపోయే ముందు గీత లేదా సుందరకాండను చదివి మీ దిండు కింద ఉంచండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య తొలగిపోయి మంచి నిద్ర వస్తుంది.

ముల్లంగి

నిద్రలేమి సమస్యకు రాహు దోషం కూడా కారణం కావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీకు ఎలాంటి శారీరక సమస్య లేకపోయినా, నిద్రపోకపోయినా, చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఒక ముల్లంగిని ఉంచండి. ఉదయం స్నానం చేసిన తర్వాత, ఈ ముల్లంగిని శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల రాహు దోషం తొలగిపోయి నిద్రలేమి సమస్య కూడా తీరుతుంది.

ఇనుప వస్తువు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ప్రతికూల శక్తి కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీని కోసం, నిద్రపోయే ముందు మీ దిండు కింద ఒక ఇనుప వస్తువును ఉంచండి. ఇది ప్రతికూల శక్తిని మీ నుండి దూరంగా ఉంచుతుంది.

పువ్వులు

మంచి నిద్ర కోసం పువ్వులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. మీరు పూజలో దేవునికి సుగంధ పుష్పాలను సమర్పించి, ఆ తర్వాత ఈ పువ్వును దిండు కింద ఉంచి నిద్రించాలి.

దుర్గా సప్తదశి

భయం, టెన్షన్, ఆందోళన వల్ల నిద్ర రాకపోతే పడుకునే ముందు దుర్గా సప్తదశిని పారాయణం చేసి తలగడ కింద పెట్టుకుని నిద్రించండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వెల్లుల్లిని దిండు కింద ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరిగి మంచి నిద్ర వస్తుంది.

Also Read:  Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు