Site icon HashtagU Telugu

Head Bath: తలస్నానం ఎప్పుడంటే అప్పుడు చేస్తే కలిగే నష్టాలు ఇవే.. పూర్తి వివరాలు?

Head Bath Benefits

Head Bath Benefits

మామూలుగా చాలామందికి ప్రతిరోజు స్నానం చేయడం అలవాటు. ఇంకొంతమంది రోజు రోజు విడిచి రోజు స్నానం చేస్తుంటారు. ఇది చాలామంది ప్రతిరోజూ స్నానం చేసే వాళ్ళు ఎక్కువగా తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తరచుగా తల స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతిరోజు తల స్నానం చేయడం వల్ల జుట్టు ఎర్రబడటం, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడం అలాంటి సమస్యల తలెత్తుతూ ఉంటాయి. అయితే కూలి పని చేసుకునే వారు చాలామంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా రెండు పూటలా కూడా తలస్నానం చేస్తూ ఉంటారు.

ఇంకొంతమంది మాత్రం ఇష్టం వచ్చిన విధంగా ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే ఈ తలస్నానానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం, ఫలితం ఉంటుందట. అలాగే వారంలో కనీసం రెండు సార్లైనా తల స్నానం చేస్తే శరీరం అనుకూలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి వారంలో ఏ రోజున తల స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం తల స్నానం చేయడం వల్ల తాపం పోతుంది. సోమవారం తల స్నానం చేయడం వల్ల అందం పెరుగుతుంది. మంగళవారం స్నానం చేయడం అన్నది అమంగళంగా భావిస్తారు. బుధవారం తల స్నానం చేయడం వల్ల వ్యాపార, వ్యవహార అభివృద్ధి బాగుంటుంది. గురువారం తలస్నానం చేయడం వల్ల ధన నాశనం కలగవచ్చట. శుక్రవారం తలస్నానం చేయడం వల్ల అనుకోని ఆపదలు కలుగుతాయి. ఇక శనివారం రోజున తల స్నానం చేయడం వల్ల మహా భోగములు కలిసి వస్తాయి.