Site icon HashtagU Telugu

Natural Holi Colours : సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఇంట్లోనే హోలీ రంగులను ఇలా తయారు చేసుకోండి..

Holi Celebrations

Holi Celebrations

Holi Colours : హోలీ.. ఈ ఏడాది మార్చి 25న దేశమంతా ఈ రంగుల పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతుంది. హోలీని ఒక్కోప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా హోలీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా కృష్ణుడిని పూజిస్తారు. హోలికా దహనం చేస్తారు. అయితే.. హోలీ రోజున వాడే రంగులు.. శరీరంపై పడటం వల్ల మీ శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. నిజానికి హోలీ రంగులు వసంతకాలంలో వికసించే ప్రకాశవంతమైన పువ్వుల్ని ఉపయోగించి సహజంగా తయారు చేసేవారు. ఆ రంగుల్నే హోలీ రోజున ఒకరికొకరు పూసుకుని పండుగ చేసుకునేవారు. కాలక్రమేణా సహజ రంగులు పోయి.. రసాయనాలతో కూడిన రంగులు వచ్చాయి. ఇవి మన ఆరోగ్యంతో పాటు.. పర్యావరణానికి కూడా హాని చేస్తాయి.

అయితే.. ఈసారి హోలీకి మీరు రసాయనాలతో కూడిన రంగులు కాకుండా.. మీ ఇంట్లోనే సహజంగా తయారు చేసిన రంగుల్ని వాడండి. మరి ఇంట్లోనే రంగులు ఎలా తయారు చేయాలో చూద్దాం.

హోలీలో ప్రధానంగా వాడేరంగులు ఎరుపు, పచ్చ, గులాబీ. ఈ రంగుల్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఎరుపు ప్రేమకు చిహ్నం. దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కొద్దిగా ఎర్రచందనం పొడి తీసుకుని.. అందులో మైదాపిండిని కలపితే చాలు. అయితే దీనిని నీటిలో కలపకూడదు. ఇందులో మైదాపిండి వాడాం కాబట్టి నీరు కలిస్తే.. అది శరీరానికి అతుక్కుపోతుంది.

గ్రీన్ కలర్ కోసం.. హెన్నా ఆకులపొడిని మైదాపిండిలో కలిపితే చాలు. సహజమైన ఆకుపచ్చ రంగు రెడీ. గ్రీన్ కలర్ వాటర్ కోసం బచ్చలికూర, కొత్తిమీరను ఉడకబెట్టి.. మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఇందులో నీరు కలిపి చల్లుకోవచ్చు. లేదా అలానే రాసుకోవచ్చు.

గులాబీ రంగు తయారీకి బీట్ రూట్ ను వాడొచ్చు. బీట్ రూట్స్ ను మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసి ఎండలో ఆరబెట్టాలి. అది ఆరిపోయాక.. శనగపిండి లేదా మైదాతో కలిపి వాడుకోవాలి.

ఊదారంగు కోసం ఎండు ద్రాక్షల్ని వాడొచ్చు. క్రాన్ బెర్రీలను నీటితో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని పాడు చేయదు. శరీరానికి మంచి రంగునిస్తుంది. అలాగే మోతుకు పూలతో పసుపు రంగును తయారు చేసుకోవచ్చు.

Also Read : Ban on Onion Export: మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఉల్లి ఎగుమ‌తుల‌పై సుదీర్ఘ‌కాలం నిషేధం..!