Site icon HashtagU Telugu

Summer Bath: వేసవిలో తలస్నానం చేసే సమయంలో తీసుకోవాల్సని జాగ్రత్తలు ఇవే…

Bath

Bath

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, శరీరానికి బాగా చెమటలు పట్టేస్తుంటాయి. దీంతో ఒళ్లంతా చిరాకు వేస్తుంది. ఆ పరిస్థితుల్లో తలస్నానం చేయాల్సిందేనని మళ్లీ మళ్లీ అనిపిస్తూ ఉంటుంది కానీ తొందరపడి తలస్నానం చేసే క్రమంలో జుట్టుకు హాని కలిగించే పొరపాట్లు ఎన్నో చేస్తుంటాం.

ఈ పొరపాట్లు జుట్టుకు హాని కలిగిస్తాయి
ఎలా పడితే అలా తలస్నానం చేస్తే వెంట్రుకల రక్షణ పొర దెబ్బతినడంతోపాటు పొడిబారిపోతాయి. క్రమంగా వెంట్రుకలు జీవం కోల్పోయి జుట్టు రాలడంతోపాటు బట్టతల వస్తుంది. తల స్నానం చేసేటప్పుడు మనం చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం.

1. వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిట్‌నర్ వేసవిలో వాడకూడదు. ఆ వేడి జుట్టుకు హాని కలిగిస్తుంది. అలాగే అధిక వేడి నీటితో తలని పదేపదే కడగడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. మీ జుట్టు రాలడం ఎదుర్కోవలసి ఉంటుంది. వేసవిలో గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు జీవం కోల్పోవు.

2. స్కాల్ప్ కు కండీషనర్ అప్లై చేయకూడదు..
జుట్టు మృదువుగా ఉండటానికి మనం తరచుగా కండీషనర్ ఉపయోగిస్తాము, అయితే దాన్ని స్కాల్ప్ కు అప్లై చేస్తే మాత్రం వెంట్రుకల మూలాలను బలహీనపరుస్తుంది. వేసవిలో కండీషనర్ ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

3. తప్పుడు షాంపూ ఎంచుకోవడం
తల స్నానానికి సరైన షాంపూని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరం డ్రై స్కిన్ అయితే , ఆయిలీ స్కిన్ జుట్టు కోసం తయారు చేసిన షాంపూని అస్సలు ఉపయోగించవద్దు, అది హానిని కలిగిస్తుంది. షాంపూని ఎంచుకోవడానికి మీరు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.

4. జుట్టును బలంగా రుద్దడం
షాంపూతో నురుగును రావడం కోసం మనం చాలాసార్లు జుట్టును ఎక్కువగా రుద్దుతాము, అలా చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది, ఇది తరువాత బట్టతలకి దారి తీస్తుంది. షాంపూని జుట్టుపై సున్నితంగా అప్లై చేసి, దానిని మూలాలకు విస్తరించేలా శుభ్రం చేసుకోవాలి.

Exit mobile version