Site icon HashtagU Telugu

Tips for Skin: శీతాకాలంలో చర్మం దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?

Mixcollage 08 Dec 2023 05 59 Pm 5824

Mixcollage 08 Dec 2023 05 59 Pm 5824

చలికాలం మొదలయ్యింది. చలికాలంలో ఎక్కువగా వేధించే సమస్యలు చర్మ సమస్య కూడా ఒకటి. చలికాలంలో చర్మం పగలడం పెదాలు పగలడం, చర్మ రఫ్ గా తయారవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చర్మం డ్రైగా అయిపోయి పగుళ్లు రావడంతో పాటు మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి సమయంలో చలికాలంలో ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో హైడ్రేషన్‌తో చర్మం దెబ్బతింటుంది. చర్మం రకానికి సంబంధించిన మాయిశ్చరైజర్‌ను వినియోగించాలి. మాయిశ్చరైజర్‌ వినియోగించడం వల్ల తేమను పట్టి ఉంచుతుంది. ఎక్కువ సేపు చర్మం తాజాగా ఉంటుంది. జనపనార గింజల నూనెను కూడా మాయిశ్చరైజర్‌ గా వినియోగించవచ్చు.

అన్ని రకాల చర్మాలకు ఇది ఉపయోగపడుతుంది. సన్‌స్క్రీన్‌ ఉపయోగించాలి చలికాలంలో ఎండ తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నా ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. మేఘావృతమైన రోజులలో కూడా సూర్యుని ప్రమాదకరమైన యూవి కిరణాలు చర్మం పై ప్రభావం చూపుతాయి. రెడ్ రాస్‌ప్‌ బెర్రీ క్రీమ్ వంటి సహజ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇది తగినంత SPF ప్రొటెక్షన్‌ అందిస్తుంది. అలాగే చలికాలం వేడి నీటితో స్నానం చేయకూడదు. చలికాలంలో దాదాపు అందరూ వేడినీటితో స్నానం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. కాని దీనివల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. న్యాచురల్‌ లిపిడ్‌ బ్యారియర్‌ ను నాశనం చేసి చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది.

స్నానానికి ముందు బాడీ ఆయిల్ అప్లై చేయడం వల్ల చర్మం తేమను కాపాడుకోవచ్చు. అయితే ఏ సీజన్‌లో అయినా హైడ్రేటెడ్‌గా ఉంటే చర్మానికి సంరక్షణ ఉంటుంది. ఎక్కువ ఆల్కహాల్, కాఫీ, టీ లేదా చక్కెర పానీయాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల సరఫరా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం నీటిని పుష్కలంగా తాగాలి. నీరు తరచూ తాగడం వల్ల చర్మం లోపల రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. చలికాలం కోసం చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామంతో చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది బ్లడ్‌ ఆక్సిజనేషన్‌ను పెంచుతుంది. తగినంత ఆక్సిజన్‌తో రక్తం చర్మ కణాలను కీలక పోషకాలతో నింపుతుంది. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగవుతుంది. యోగా, రన్నింగ్ లేదా ఏదైనా ఇతర స్పోర్ట్స్‌ ఆడటం ద్వారా శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలంలో తేమ స్థాయి, తక్కువ ఉష్ణోగ్రత అనేక చర్మ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మట్టి, సీవీడ్ సారాన్ని కలిగి ఉన్న మాస్క్‌ని ఉపయోగించాలి.