మామూలుగా మనం రొయ్యలతో చాలా తక్కువ రెసిపీలను మాత్రమే తినే ఉంటాం. ఈ రొయ్యల ధర ఎక్కువ కావడంతో చాలామంది వీటిని తినాలని ఆశ ఉన్నా కూడా వాటి ధర కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. దాంతో ఎక్కువగా చాలామంది ఈ రొయ్యల రెసిపీలను రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అలాంటి రెసిపీలలో రొయ్యల పోహా కూడా ఒకటి. మరి ఈ రెసిపీని ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు – పది
అటుకులు – రెండు కప్పులు
ఉలిపాయ – ఒకటి
పచ్చి బటాణీలు – 15
కరివేపాకులు – గుప్పెడు
ఆవాలు – ఒక స్పూను
పసుపు – అర స్పూను
నూనె – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం తురుము – అర స్పూను
పచ్చిమిర్చి – రెండు
వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
తయారీ విధానం :
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి రొయ్యలను బాగా వేయించుకోవాలి. కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకులు వేసి వేయించాలి. అందులో పచ్చిబఠాణీలు, ఉల్లితరుగు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి వేయించాలి. కొత్తి మీర తురుమును చల్లి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. అటుకులను పదినిమిషాల ముందు నానబెట్టుకోవాలి. నీళ్లలో నుంచి అటుకును తీసి చేత్తోనే బాగా పిండి కళాయిలోని మిశ్రమంలో వేయాలి. గరిటెతో మిశ్రమాన్ని బాగా కలపాలి. కావాలనుకుంటే నిమ్మరసం పైన చల్లుకోవచ్చు. అంతే రొయ్యల పోహా రెడీ.