Site icon HashtagU Telugu

Prawns Pakoda: ఎంతో క్రిస్పీగా ఉండే రొయ్యల పకోడీ.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?

Mixcollage 17 Mar 2024 07 15 Pm 6670

Mixcollage 17 Mar 2024 07 15 Pm 6670

నాన్ వెజ్ ప్రియులకు రొయ్యల పేరు చెబితే చాలు నోరూరిపోతూ ఉంటుంది.. మరికొందరు మాత్రం రొయ్యలను అంతగా ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు రొయ్యలు తినని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. తరచూ రొయ్యలతో ఒకే రకమైన తిని తిని బోర్ కొడుతోందా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే రెసిపీ ట్రై చేయాల్సిందే. ఇంతకీ ఆ రెసిపీ ఏది దానిని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..

కావాల్సిన పదార్థాలు :

రొయ్యలు – అరకిలో
కారం – ఒక టీస్పూను
బియ్యం పిండి – రెండు టీస్పూన్లు
పసుపు – అర టీస్పూను
సెనగపిండి – పావు కప్పు
కరివేపాకు – రెండు రెమ్మలు
ఉప్పు రుచికి సరిపడా
నూనె – సరిపడా
మొక్కజొన్న పిండి – రెండు స్పూన్లు

తయారీ విధానం :

ముందుగా రొయ్యలు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చిన్న రొయ్యలు అయితే అలాగే ఉంచుకోవచ్చు. పెద్దవైతే ఒక రొయ్యని రెండు మూడు ముక్కలుగా చేస్తే పకోడీ బాగా వస్తుంది. రొయ్య కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. కొంచెం నీరు చేర్చాలి. మరీ ఎక్కువేస్తే జావలా అయి పకోడీ వేయలేరు. ఇప్పుడు ఆ పిండిలో తరిగిన రొయ్యలు వేసి బాగా కలపాలి. కరివేపాకులు కూడా వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక పిండిని పకోడీల్లా వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వేగాక తీసి ప్లేటులో వేసుకోవాలి.