Site icon HashtagU Telugu

Prawns Noodles: ఎంతో స్పైసీగా ఉండే ప్రాన్స్‌ నూడిల్స్‌.. ఇలా చేస్తే చాలు కొన్ని కూడా మిగలవు?

King Prawn Chow Mein 05

King Prawn Chow Mein 05

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు చాలామంది ఇంట్లో చేసిన ఫుడ్డు కంటే బయట ఫుడ్డుకి బాగా అలవాటు పడిపోయారు. ఇంట్లో ఆడవారు ఎంత టేస్టీగా చేసి పెట్టినప్పటికీ ఎక్కువగా బయట ఫుడ్ ని తింటూ ఉంటారు.. అలా ఎక్కువగా జంక్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు.. జంక్ ఫుడ్స్ లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడేది నూడిల్స్‌. వీటిని తెగ ఇష్టపడే తింటూ ఉంటారు. కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా వీటిని కావాలనే పిల్లలు తెగ మారం చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట ఈ నూడిల్స్‌ ని ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండి. అయితే ఎప్పుడైనా ఇంట్లో రొయ్యల నూడిల్స్‌ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ నూడిల్స్‌ ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రాన్స్ నూడిల్స్‌ కి కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి- 4 టీస్పూన్‌
పచ్చిమిరపకాయలు- 2
రెడ్‌ చిల్లీ పేస్ట్ – 2 టీస్పూన్లు
నూనె- 3 టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర- కొద్దిగా
శుభ్రం చేసిన రొయ్యలు- 12
ఎగ్‌నూడిల్స్‌- కప్పు
ఉప్పు- రుచికి తగినంత
సోయాసాస్‌- టీ స్పూన్‌
రెడ్‌ చిల్లీ సాస్‌- ఒకటిన్నర టీస్పూన్‌
బ్లాక్‌పెప్పర్‌ పౌడర్‌- 1 టీస్పూన్‌
వెనిగర్‌- టీస్పూన్‌
స్ర్పింగ్‌ ఆనియన్‌ గ్రీన్స్‌- 2 స్టాక్స్‌

ప్రాన్స్ నూడిల్స్‌ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక కప్పులో ప్రాన్స్‌ తీసుకుని అందులోకి గార్లిక్‌తో పాటు మిరపపొడి వేయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్‌ ఆన్‌ చేసి ప్యాన్‌లో నూనె వేయాలి. కాస్త వేడయ్యాక రొయ్యలు వేయాలి. మంట పెంచి బాగా వేగించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకుని పక్కనబెట్టుకోవాలి. ఆ తర్వాత మరో ప్యాన్‌లో నూనె వేసి పచ్చి మిరపకాయలు వేసి వేయిస్తూ మధ్యలో గార్లిక్‌, కొత్తిమీర వేయాలి. గార్లిక్‌ బంగారు రంగు వచ్చాక నూడిల్స్‌ వేయాలి. గరిటెతో తిప్పుతూ సోయాసాస్‌, రెడ్‌ చిల్లీసాస్‌ కొద్దిగా వేయాలి. పెప్పర్‌ పౌడర్‌ వేసి మిక్స్‌ చేస్తుండాలి. దీనికి రొయ్యలు కలపాలి. బాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వెనిగర్‌ వేయాలి. చిల్లి గార్లిక్‌ ప్రాన్స్‌ నూడిల్స్‌ రెడీ.