Site icon HashtagU Telugu

Prawns fried Rice: రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపి.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 01 Jan 2024 07 31 Pm 5298

Mixcollage 01 Jan 2024 07 31 Pm 5298

సాధారణంగా ఎక్కువగా మనం చేపలు మటన్ చికెన్ రెసిపీలనే తింటూ ఉంటాం. ఫ్రాన్స్ తో తయారు చేసే రెసిపీ లను చాలా తక్కువగా తింటూ ఉంటాం. ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ కర్రీ లాంటి రెసిపీలు కూడా ఎక్కువగా రెస్టారెంట్లో తిని ఉంటాం. అయితే ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్థాలు

ప్రాన్స్ – అరకిలో
బాస్మతి బియ్యం – అరకిలో
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
పచ్చి బఠాని – అరకప్పు
గుడ్లు – 2
నూనె – 1 కప్పు
క్యారెట్ ముక్కలు – అరకప్పు
బీన్స్ ముక్కలు – అరకప్పు
కరివేపాకు – కొంచం
కొత్తిమిర – 1 కట్ట
సోయా సాస్ – 1 టీ స్పూన్
మిరియాల పొడి – అర టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా
పసుపు – అర టీ స్పూన్

ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ విధానం:

ఇందుకోసం ముందుగా పచ్చి బఠాని, బీన్స్, క్యారెట్ ముక్కలు ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరుపోసి స్టవ్ పై పెట్టి ఉడకబెట్టాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని గుడ్లు పగలగొట్టి కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి పక్కన పెట్టాలి గుడ్డు సొనను కర్రీల వండి పక్కన పెట్టాలి. అలాగే ప్రాన్స్ ను కూడా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి నీరుపోసి ఉడకపెట్టి ఉంచుకోవాలి. తరువాత అన్నం కొంచం పదునుగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి, కాగాక ఉల్లి ముక్కలు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉడకబెట్టిన ప్రాన్స్ వేసి వేగాక పచ్చిమిర్చిపేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, ఉడకపెట్టిన వెజిటేబుల్స్ వేసి కొద్దిగా వేపి ఉడికిన అన్నం వేసి కలిపి, గుడ్డు మిశ్రమం కూడా వేసి బాగా మిక్స్ అయ్యేవరకు కలుపుతూ చివర్లో కొత్తిమిరతో గార్నిష్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ.