Site icon HashtagU Telugu

Prasadam Boorelu: ప్రసాదం బూరెలను సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Mixcollage 06 Mar 2024 07 07 Am 3614

Mixcollage 06 Mar 2024 07 07 Am 3614

చాలా మంది పండుగ వచ్చింది అంటే చాలు ప్రసాదం బూరెలను తయారు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పండుగ సమయంలో మాత్రమే కాకుండా మామూలు సమయంలో కూడా ఈ బూరెలను తినాలని అనుకుంటూ ఉంటారు.. మరి పండుగ స్పెషల్ ప్రసాదం బూరెలను టెస్టిగా ఎలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

మినప్పప్పు – ఒక కప్పు
బియ్యం – ఒక కప్పు
నెయ్యి – రెండు స్పూనులు
నీళ్లు – ఒక కప్పు
పంచదార – ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, మరో గిన్నెలో బియ్యం నానబెట్టుకోవాలి. నాలుగు గంటల పాటూ నానిన తర్వాత రెండింటినీ మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ అందంగా కాకుండా రుబ్బుకోవాలి. ఆ పిండిని తీసి ఒక గిన్నెలో వేసి ఒక స్పూను ఉప్పువేసి కలపాలి. దాన్ని ఒక గంట పాటూ పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించాలి. అయిదు నిమిషాలు వేగాక అందులో మరగకాచిన వేడి నీళ్లను ఒక గ్లాసు వేయాలి. అడుగంటిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఒక కప్పు పంచదార కూడా వేయాలి. ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి. చిన్న మంట మీద ఉడికిస్తే రవ్వ మాడిపోకుండా బాగా ఉడుకుతుంది. తర్వాత బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. బొంబాయి రవ్వను బూరెల సైజులో ఉండలుగా చుట్టుకుని మినప – బియ్యం పిండిలో ముంచి నూనెలో వేయించాలి.

Exit mobile version