Site icon HashtagU Telugu

Potato Pop Corn: పొటాటో పాప్ కార్న్ ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినాల్సిందే?

Potato Pop Corn

Potato Pop Corn

మామూలుగా సాయంత్రం అయ్యింది అంటే చాలు చాలామంది ఎక్కువగా స్నాక్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మంది ఆహార పదార్థాలను తినడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. బయట కాకుండా ఇంట్లో ఉన్నవారు ఏదైనా కొత్త రకంగా ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఇంకా అందులో బాగానే ఈ మధ్యకాలంలో పాప్ కార్న్ ప్యాకెట్స్ రావడంతో చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు మీరు కేవలం మొక్కజొన్నతో తయారుచేసిన పాప్ కార్న్ ని మాత్రమే తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా బంగాళదుంప తయారుచేసిన పాప్ కార్న్ ని తిన్నారా. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా కూడా దీనిని ట్రై చేయడం వల్ల లొట్టలు వేసుకొని మరి తినేయవచ్చు.. మరి ఇందుకు కావాల్సిన పదార్థాలు దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొటాటో పాప్ కార్న్ కి కావలసినవి పదార్థాలు.

బంగాళదుంపలు – 3

చాట్‌ మసాలా – పావు టీ స్పూన్

కార్న్‌ పౌడర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌

ఉప్పు – తగినంత

కారం – కొద్దిగా

నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

 

తయారీ విధానం..

ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా ఉప్పు, చాట్‌ మసాలా, కార్న్‌ పౌడర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడు కార్న్‌ పౌడర్, చాట్‌ మసాలా, ఉప్పు ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం చల్లి సర్వ్‌ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే స్పైసీ పొటాటో కార్న్ రెడీ.