మనం బంగాళాదుంప(Potato)తో కూర, కుర్మా, వేపుడు.. ఇంకా రకరకాలు వండుకుంటూ ఉంటాము. అయితే మనం బంగాళాదుంపను వాడుకొని తొక్కను పడేస్తుంటాము. అయితే బంగాళాదుంప తొక్కలో(Potato Peel )కూడా అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. బంగాళాదుంప తొక్కలు మన ఆరోగ్యానికి, అందానికి కూడా ఉపయోగపడతాయి.
* బంగాళాదుంప తొక్కను మన ముఖానికి రాసుకుంటే మన ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. మన ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* బంగాళాదుంప తొక్కలను కొన్ని నీళ్లు పోసి ఉడికించి తరువాత చల్లార్చి దానిని మన జుట్టుకు పట్టిస్తే మన జుట్టు తొందరగా తెల్లబడదు.
* బంగాళాదుంప తొక్కలలో ఐరన్ ఉంటుంది కాబట్టి బంగాళాదుంపను తొక్కతో పాటు తింటే మన శరీరంలో రక్తహీనత తగ్గుతుంది.
* బంగాళాదుంప తొక్కలో ఉండే యాంటి మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా చేస్తాయి. బంగాళాదుంప తొక్కను పేస్ట్ లాగా చేసి గాయాలు, పుండ్లు ఉన్న చోట రాస్తే అవి తొందరగా తగ్గుతాయి.
* బంగాళాదుంప తొక్కలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి.
* బంగాళాదుంప తొక్కలను మెత్తగా చేసి దాని నుండి రసాన్ని తీసి దానిని కళ్ళ కింద నల్లని వలయాలు ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి. టానింగ్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఈ విధంగా మన రోజూ వాడుకునే బంగాళాదుంపల నుండి తొక్కను పడేయకుండా వాడుకుంటే మన ఆరోగ్యానికి, అందానికి కూడా మంచిది.
Also Read : Kunda Biryani: హోటల్ స్టైల్ కుండ బిర్యాని ఇంట్లోనే చేసుకోండిలా?