మామూలుగానే మనం బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. బంగాళదుంప ఫ్రై, ఆలూ మసాలా కర్రీ, ఆలూ టిక్కా, ఆలు బోండా, ఆలూ బిర్యానీ ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బంగాళదుంప తయారుచేసిన అప్పడాలు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
బంగాళాదుంపలు పెద్దవి – మూడు
ఆయిల్ – ఒక స్పూను
ఎండు మిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
బంగాళా దుంపలను మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత చల్లారనివ్వాలి. ఆ దుంపలను మెత్తగా చేత్తో మెదిపి ఒక గిన్నెలో వేయాలి. ఆ దుంపల్లో ఉప్పు, ఎండుమిర్చి తురుమును వేసి బాగా కలపాలి. అరస్పూను నూనె కూడా వేసి బాగా కలపాలి. చిన్న ముద్దను తీసి ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టాలి. ఆ షీట్ కు ముందే కాస్త ఆయిల్ అప్లై చేయాలి. ఆ పిండి ముద్దను చేత్తోనే గుండ్రంగా అప్పడం పరిమాణానికి ఒత్తుకోవాలి. దాన్ని ఒక పెద్ద ప్లేటులో లేదా, పొడి చీరపై ఆరబెట్టాలి. పూర్తిగా ఎండాక వాటిని గాలి చొరబడని కంటైనర్లలో వేసి దాచుకోవాలి. నూనెలో వీటిని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి.