Site icon HashtagU Telugu

Potato Bites: పిల్లలు ఎంతగానో ఇష్టపడే పొటాటో బైట్స్‌.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?

Mixcollage 05 Feb 2024 08 47 Pm 7693

Mixcollage 05 Feb 2024 08 47 Pm 7693

మామూలుగా సాయంత్రం అయ్యింది అంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి స్నాక్స్ తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు తినే స్నాక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏవైనా కొత్తగా స్నాక్స్ ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే.

పొటాటో బైట్స్‌ కి కావాల్సిన పదార్థాలు :

బంగాళాదుంపలు – పావు కిలో
ఉప్పు – రుచికి తగినంత
మిరియాల పొడి – పావు టీస్పూన్‌
చిల్లీ ఫ్లేక్స్‌ – సరిపడా
చీజ్‌ – 100 గ్రాములు
కోడిగుడ్డు – ఒకటి
బ్రెడ్‌ పొడి – అర కప్పు
నూనె – సరిపడ

పొటాటో బైట్స్‌ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత పొట్టు తీసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. కోడిగుడ్డును పగలకొట్టి గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టుకోవాలి బ్రెడ్‌ పొడిని కొద్దిగా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి చీజ్‌ను తురుముకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపల పేస్టులో ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పూరీ పిండి పరిమాణంలో బంగాళదుంప పేస్టును తీసుకుని దాంట్లో అర టీస్పూను చీజ్‌ తురుమును ఉంచి, ఉండలా చుట్టుకోవాలి. ఇలా ఉండలన్నింటినీ తయారు చేసుకోవాలి. తర్వాత వాటిని కోడిగుడ్డు సొనలో ముంచుకుంటూ, తర్వాత బ్రెడ్‌ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పొటాటో ఉండలను వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. అంతే టేస్టీగా ఉండే పొటాటో బైట్స్‌ రెడీ.