డబ్బులు(Money) అందరికీ కావాలి. అందరూ డబ్బును కష్టపడి సంపాదిస్తారు. అయితే కొన్ని రకాల అలవాట్లు(Habits) ఉన్నవారి దగ్గర సంపద అనేది నిలువదు. వారు వారి జీవితాంతం కష్టపడుతూ పేదరికంలోనే గడుపుతారు.
ఎవరైతే సూర్యోదయం తరువాత కూడా నిద్ర లెగరో వారి దగ్గర డబ్బులు నిలువవు. అలాంటి వారు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందలేరు.
చాణుక్యుడు తన నీతిశాస్త్రంలో పరిశుభ్రత లేని వారి దగ్గర సంపద నిలువదు అని చెప్పారు. పరిశుభ్రత లేని చోట మనమే ఉండలేము అలాంటిది లక్ష్మీ దేవి ఎలా నిలబడుతుంది. అంటే ఎవరైతే పళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోరో, ఎవరైతే మురికి బట్టలు వేసుకుంటారో, ఇంటిని ఎవరైతే పరిశుభ్రంగా ఉంచుకోరో వారి దగ్గర లక్ష్మీ దేవి నిలువదు. అందువలన పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యమైనది.
చాణుక్య నీతి శాస్త్రం ప్రకారం ఎవరైనా తమకు సరిపడా ఆహారాన్ని తినాలి. అంతేకాని ఆహారాన్ని అతిగా తింటే వారు రోగాల పాలవుతారు. కాబట్టి వారు కష్టపడి సంపాదించినది మొత్తం మందులకు, హాస్పిటల్ ఖర్చులకు పెట్టవలసి వస్తుంది. కాబట్టి తమకు సరిపడా ఆహారాన్ని మించి ఎవరైతే భుజిస్తారో వారి దగ్గర కూడా సంపద నిలువదు.
ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారి వలన ఇతరులు బాధపడతారు. కాబట్టి వారి బాధ మన సంపద పైన పడుతుంది. కాబట్టి అందరితో మంచిగా మాట్లాడాలి. అప్పుడే సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అందుకే డబ్బులు సంపాదించడం తేలికైన పని కాదు. ఒకవేళ సంపాదించినా దానిని పొదుపు చేయగలగాలి.
అందుకే డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా వాటిని పొదుపు చేయాలన్న మన దగ్గర ఆ సంపద నిలవాలన్న మనం కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఉదయాన్నే లేవడం,
ఆహారాన్ని మితంగా తినడం, అందరితో మంచిగా మాట్లాడడం, ఎప్పుడూ మన ఇంటిని, మనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం.. లాంటివి అలవాటూ చేసుకుంటే కష్టపడి సంపాదించిన డబ్బు మనతోనే ఉంటుంది.
Also Read : Health Benefits: తులసి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
