Site icon HashtagU Telugu

Pineapple Halwa: పైనాపిల్ హల్వా ఇలా చేస్తే లొట్టలు వేసుకొని మరీ తినేయాల్సిందే?

Mixcollage 22 Feb 2024 09 17 Pm 8562

Mixcollage 22 Feb 2024 09 17 Pm 8562

మామూలుగా మనం ఎన్నో రకాల హల్వా రెసిపీ లు తినే ఉంటాము. క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, గోధుమ రవ్వ హల్వా అంటూ రకరకాల హల్వాలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా పైనాపిల్ హల్వా తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రెసిపీ కి ఏ ఏ పదార్థాలు కావాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

పైనాపిల్ ముక్కలు – ఒకటిన్నర కప్పు
కుంకుమపువ్వు – చిటికెడు
పంచదార – నాలుగు స్పూన్లు
నెయ్యి – నాలుగు స్పూన్లు
ఎండు ద్రాక్షలు – పావు కప్పు
రవ్వ – ఒక కప్పు
పైనాపిల్ ఎసెన్స్ – కొద్దిగా
జీడిపప్పు – గుప్పెడు
పచ్చి యాలకులు – సరిపడా
నీరు – సరిపడా

తయారీ విధానం :

స్టవ్ మీద కడాయి పెట్టి, గ్లాసుడు నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ఎసెన్స్, పంచదార, కుంకుమపువ్వు వేసి ఉడికించాలి. మీడియం మంట మీద ఉంచి పావుగంట సేపు ఉడికిస్తే చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. ఉడికిన పైనాపిల్‌ను మెత్తగా అయ్యేలా బాగా కలపాలి. ఆ మిశ్రమం అంతా నీళ్లగా కాకుండా కాస్త ముద్దలా అయ్యే వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మరొక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దానిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడెక్కాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రవ్వ, యాలకుల పొడి వేసి వేయించాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించాలి. రవ్వ గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని ఈ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మంటను తగ్గించి ఈ మొత్తం మిశ్రం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నీరంతా ఆవిరి అయిపోయి హల్వాలా తయారయ్యాక, పైన ఎండు ద్రాక్షను జల్లుకోవాలి. అంతే టేస్టీగా ఉండే పైనాపిల్ హల్వా రెడీ.

Exit mobile version