Site icon HashtagU Telugu

Pineapple Beauty Benefits: పైనాపిల్ తో ఇలా ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం?

Mixcollage 26 Jan 2024 05 11 Pm 9555

Mixcollage 26 Jan 2024 05 11 Pm 9555

పైనాపిల్.. దీనినే తెలుగులో అనాసపండు అని పిలుస్తారు. ఈ పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ పైనాపిల్ తినడానికి కాస్త తీయతీయగా పుల్లపుల్లగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పైనాపిల్ ను చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడుతాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఉండే మాంగనీసు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. పైనాపిల్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

మరి పైనాపిల్ తో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శీతాకాలం చలికారణంగా చర్మం త్వరగా పొడిబారుతుంది. చర్మానికి తేమను అందించడానికి ఫైనాపిల్‌ ఫేస్‌మాస్క్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ప్యూరీ, రెండు టీస్పూన్ల తేనె, రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మూఖానికి మాస్క్‌లా అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఓపెన్‌ పోర్స్‌ కారణంగా ఇబ్బంది పడుతుంటే ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, ఓట్‌ మీల్‌ పౌడర్‌ కలిపి మిక్స్‌ చేయాలి.

ఈ విశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఓపెన్‌ పోర్స్‌ తగ్గుతాయి. ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, రెండు టీస్పూన్ల జోజోబా ఆయిల్‌ను మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ప్యూరీ, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్, ఒకటి నుంచి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకుని, బాగా మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత, నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి రంగు వస్తుంది.