ఇందుకోసం గుప్పెడు పుదీనా ఆకులకు నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ప్రిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసుకొని 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుందట. ఇలా రోజుకు రెండు సార్లు ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఒక టేబుల్ స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టమాటా గుజ్జు తీసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని పిగ్మెంటేషన్ సమస్య ఉన్న చోట అప్లై చేసి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ఈ సమస్య ఇట్టే తగ్గిపోతుందట.
అదేవిధంగా టేబుల్ స్పూన్ చొప్పున కలబంద గుజ్జు, తేనె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్ ఉన్న చోట రాసి అరగంట పాటు ఆరనించి ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం పై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుందట. వివరిస్తున్నారు.
కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని అందులో పచ్చిపాలను చేర్చి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడడంతో పాటు చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.